అసలు సిసలు షో అంటే ఏమిటో చూపిస్తా – పవన్

0గత కొన్నిరోజులుగా నటి శ్రీరెడ్డి పవన్ ను అభ్యంతరకర రీతిలో దూషించిన వివాదం టీవీ ఛానెళ్లలో ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది. దీనిపై పలు ఛానెళ్లలో ఇప్పటికే లెక్కకు మించిన డిబేట్లు, స్పెషల్ షోలు జరిగాయి. రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చిన ఈ వివాదాన్ని పలువురు సినీ ప్రముఖులు ఖండించగా ప్రముఖ దర్శకుడు వర్మ తప్పంతా తనదేనంటూ స్వయంగా ఒప్పుకున్నారు కూడ.

దీంతో ఏనాడూ వ్యక్తిగత దూషణలపై పెద్దగా స్పందించని పవన్ నిన్న రాత్రి నుండి ఈ వ్యవహారం తనను ఎంతలా బాధించిందో తెలుపుతూ అధికార ప్రభుత్వం మీడియా ఛానెళ్లను చేతిలో పెట్టుకుని తనను అనవసరంగా విమర్శిస్తోందని, చివరికి తన తల్లిని కూడ దూషించారని మండిపడ్డారు.

అలాగే మీడియా ఛానెళ్లన్నీ టిఆర్పీల కోసం ఈ ఉదంతాన్ని పదే పదే టెలికాస్ట్ చేసి మరింత బాధ్యతారహితంగా నడుచుకున్నాయని అంటూ మీకందరికీ టీఆర్పీలు తెచ్చే షోలు అంతలా ఇష్టమైతే ఇకపై అసలు సిసలు షో అంటే ఏమిటో నేను చూపిస్తాను అంటూ సమాధానమిచ్చారు.