ఇమాన్యుయేల్ ను సర్ ప్రైజ్ చేసిన పవన్

0pawan-kalyan-anu-emmanuelపవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఎవరినైనా అభిమానిస్తే.. రకరకాలుగా ఆ అభిమానాన్ని చాటుకుంటాడు. నచ్చినవాళ్లకు తన ఫామ్ హౌజ్ నుంచి పండ్లు పంపించడమో.. మరో రకంగా అయినా తన ఇష్టాన్ని చాటడమో చేస్తుంటాడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమాలో.. ఓ హీరోయిన్ గా నటిస్తున్న అను ఇమాన్యుయేల్ ను పవన్ అలాగే సర్ ప్రైజ్ చేశాడు.

కేరళ వంటకాల్లో అనూ ఇమాన్యుయేల్ అప్పం వంటకాన్ని బాగా ఇష్టపడుతుందట. అప్పం అంటే.. మన దగ్గర ఉండే అట్ల లాంటివే. షూటింగ్ గ్యాప్ లో మాట్లాడుతున్నపుడు.. పవన్ ఓ సారి తనను ఏది ఇష్టంగా తింటావని అడిగితే.. అప్పం అంటే చాలా ఇష్టం అని చెప్పానని.. అనూ ఇమాన్యుయేల్ చెప్పింది. ఏదో సరదాకి అడిగాడని అనుకున్నా కానీ.. ఆ తెల్లారి ఇంట్లో చేసిన అప్పం లను పవన్ తనకు పంపడంతో షాక్ అయినట్టు అనూ చెప్పింది.

అప్పంలతో పాటు.. కొన్ని కర్రీలు కూడా పవన్ వండించి పంపారని.. తన జీవితంలో ఈ విషయాన్ని మరిచిపోనని.. అనూ చెబుతోంది.