పవన్ కళ్యాణ్ తన గొప్ప మనసు మరోసారి చాటుకున్నాడు

0పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరో. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని అశేషమైన అభిమానుల్ని సంపాదించుకున్నాడు. పవన్ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో.. వాళ్లన్నా పవర్ స్టార్‌కు అంతే ఇష్టం. అభిమానులతో అతడు ఎలా ఉంటాడో తెలిపే ఒక అరుదైన సంఘటన ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో జరిగింది.

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ ఆడియో రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో ఒక పవన్ అభిమాని వేదికపై హల్‌చల్ చేసి, అందరినీ కంగారు పెట్టాడు. మాట్లాడేందుకు పవన్ వేదికపైకి చేరుకోగానే ఓ అభిమాని వచ్చి ఆయన కాళ్లపై పడ్డాడు. అంతలోనే తేరుకున్న సిబ్బంది.. అభిమానిని కిందికి లాక్కుని వెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన పవన్.. వారందరిని వారించి వేదికపైనే అభిమానితో మాట్లాడాడు. అంతేకాదు అతడితో ఒక సెల్ఫీకి కూడా ఫోజిచ్చాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ అంటే తమకు ఎందుకు ఇష్టమో ఈ వీడియో చూడండంటూ అభిమానులు వీడియోను షేర్ చేస్తున్నారు.