పవన్‌కు మరో వారసుడు!

0Pawan-Kalyanపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈరోజు తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. పవన్ కల్యాణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడట. పవన్‌కు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. ఇప్పుడు మరో వారసుడు తమ ఫ్యామిలీలోకి రాబోతున్నాడు. అసలు విషయంలోకి వస్తే.. పవన్ భార్య అనా లెజ్‌నెవా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. అక్టోబర్ నెలలో ఆమె ప్రసవించనుంది.

త్రివిక్రమ్ సినిమా కోసం విదేశాలకు వెళ్ళిన పవన్ త్వరలోనే తిరిగి ఇంటికి చేరుకోనున్నాడు. లెజ్‌నెవా ప్రసవ సమయంలో భార్య వెంటే పవన్ ఉండబోతున్నాడని చెబుతున్నారు. పవన్‌కు లెజ్‌నెవా మూడో భార్య అనే సంగతి తెలిసిందే. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్‌కు ఇద్దరు పిల్లలున్నారు. వారే అకిరా, ఆద్య. అలానే లెజ్‌నెవాకు పవన్‌తో వివాహం జరిగిన తరువాత పోలెన్ అనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరో వారసుడికి జన్మనివ్వబోతుంది. ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో పవన్.. లెజ్‌నెవాను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమె అప్పుడప్పుడు మెగాకుటుంబ వేడుకలకు కూడా హాజరవుతుంటుంది.