పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సెట్స్ లో నవ్వుల జల్లు

0pawan-kalyan-and-trivikram-త్రివిక్రమ్‌ సినిమా అనగానే నవ్వుకోవడానికి సిద్ధమైపోవల్సిందే. అదే సమయంలో ఆయన సినిమాలు క్లాస్‌గానూ… బలమైన భావోద్వేగాలతోనూ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంటాయి. పవన్‌కల్యాణ్‌ కూడా తన సినిమాలు అదే తరహాలో ఉండాలని భావిస్తుంటారు. అలా ఇద్దరి అభిరుచులు కలవడంతోనే మంచి స్నేహితులయ్యారు, మళ్లీ మళ్లీ కలిసి సినిమాలు చేస్తున్నారు. ఆ ఇద్దరి అభిరుచికి తగ్గట్టుగానే ఒకపక్క స్టైలూ, మరోపక్క స్మైలూ కనిపిస్తోంది ఈ స్టిల్‌లో. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం యూరప్‌లో ఆఖరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడి సెట్లో కనిపించిన దృశ్యమిది. ఓ సరదా సన్నివేశం చేసే ప్రయత్నంలో ఉన్నారేమో, ఇద్దరూ ఒకే రకమైన స్మైల్‌తో కనిపిస్తున్నారిక్కడ. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.