రేణు వివాహం పై స్పందించిన పవన్

0పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వేరు పడ్డాక రేణు దేశాయ్ చాలా కాలం ఒంటరిగానే ఉన్నారు. ఒకపక్క తన పిల్లలైన ఆధ్యా, అకీరానందన్ లని పెంచుతూ మరోపక్క తన కెరీర్ ని చూసుకుంటున్న రేణు దేశాయి సేవా కార్యక్రమాలు, మహిళలపై జరుగుతున్న దాడులపై ఎక్కువగా స్పందిస్తుంటుంది.

అయితే తన ఒంటరితనాన్ని, పిల్లల భవిష్యత్తుని కాపాడే వ్యక్తి దొరికితే పెళ్లిచేసుకోవడానికి సిద్దమేనంటూ గతంలో రేణు ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసందే. అయితే ఆ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా విమర్శలు చేయడంతో వాటికీ ఘాటుగా స్పందించారు రేణు.

అయితే తాజాగా రేణు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తన ఎంగేజ్మెంట్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రేణు. అయితే రేణు నిర్చితార్థం పై సోషల్ మీడియాలో పవన్ స్పందించారు “రేణుదేశాయ్ గారికి నా హార్ధిక కృతజ్ఞతలు.. జీవితంలో మరో కొత్త అంకాన్ని ప్రారంభిస్తున్న మీకు అంతా మంచి జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా” అని పవన్ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని వెల్లడించారు.