ఒక్కటైన మెగాహీరోలు !

0తనను టార్గెట్ చేసుకుని అనవసరమైన వివాదాలు రేపుతూ, టిఆర్పీల కోసం చివరికి వయసులో పెద్దవారైన తన తల్లిని కూడ చెప్పలేని రీతిలో దూషించారని మీడియాపై, అధికార ప్రభుత్వంపై ట్విట్టర్ ద్వారా విరుచుకుపడిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో తన కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి నాగబాబుతో పాటు యువ హీరోలు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లు హాజరై పవన్ కళ్యాణ్ కు తమ మద్దతు తెలిపారు. సుమారు 3 గంటలకు పైగానే జరిగిన ఈ సమావేశంలో మెగా హీరోలు ఏం చర్చించుకున్నారు, ఈ వివాదంపై వారి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇలా మెగా హీరోలంతా కలిసి పవన్ వెనుక నిలబడటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.