ఆడపిల్లల జోలికి వెళ్తే.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక

0ఆడపిల్లల జోలికి వెళ్తే.. బహిరంగంగా వారి తోలు తీయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై మృగాల సామూహిక అత్యాచారం, హత్య తన హృదయాన్ని ద్రవింపజేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన తరఫున కథువా ఘటనని ఖండిస్తూ ఈ రోజు నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన చేపట్టారు. ‘జనసేన తరఫున ఆడపిల్లల్ని రక్షించుకునేందుకు కఠినమైన శిక్షలు పడేలా చట్టాలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. చట్టం బలహీనుల విషయంలో బలంగా, బలవంతుల విషయంలో బలహీనంగా పనిచేస్తోంది. ఈ విధానంలో మార్పు వచ్చేలా పోరాడతాం.” అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.