చంద్రబాబుకు మరోదారి లేదంటున్న పవన్ కళ్యాణ్

0ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయింది. మంత్రి లోకేశ్‌ చేస్తున్న అవినీతి చంద్రబాబుకు కనిపించడం లేదా? లోకేశ్‌ అవినీతి మీ దృష్టికి వచ్చిందా? రాలేదా? , ఎన్టీఆర్‌ మనవడు ఏం చేస్తున్నాడు? లోకేశ్‌ అవినీతిని చూసి.. ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోంది. నేను ముఖ్యమంత్రిని ఓ మాట‌ అడుగుతున్నాను.. 2014లో మీతో నేను కలిసి ఉన్నప్పుడు ప్రజలతో మోదీ ఒక మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కాం ఏపీ కాకుండా ఉండాలంటే తమకు ఓటేయాలని అన్నారు. ఈ రోజు స్కాం ఆంధ్రా అవ్వలేదు కానీ టీడీపీ నాయకుల వల్ల అవినీతి ఆంధ్రా మాత్రం అయింది’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన మరోసారి ఏపీ సిఎం పై విమర్శలు గుప్పించారు. విజయవాడలో జాతీయ మీడియాతో పవన్ మాట్లాడుతూ.. ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడారని, ప్రజా విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని, పరిస్థితులు చేజారక చంద్రబాబు మేల్కొన్నారని, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడం తప్ప ఆయనకు మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు.