శ్రీ రెడ్డి కి పవన్ మద్దతు..

0



గత నెల రోజులుగా మీడియా లో శ్రీ రెడ్డి పేరు మారుమోగిపోతున్న సంగతి తెల్సిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ ఫై శ్రీ రెడ్డి పోరాటం చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఈమెకు పలు సంఘాలు మద్దతు పలుకగా , తాజాగా జనసేన నేత & సినీ నటుడు పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి కి సలహా ఇస్తూ మద్దతు తెలిపాడు.

తాజాగా జమ్మూలోని ఆసిఫాపై జరిగిన అత్యాచారంపై పవన్ కల్యాణ్ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆయన కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో అన్యాయం జరిగితే చట్టాలను ఆశ్రయించాలన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా కోర్టుకి వెళ్ళవచ్చని.. అలాంటి వారికి తమలాంటి వారి మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.. కానీ టీవీ చర్చలకు వెళ్ళటం సరైంది కాదని సూచించారు. గతంలో షూటింగ్ సమయంలో చాలా సంఘటనలు జరిగాయని… తాను కూడా చాలా సందర్భాలలో ఇలాంటి వాటిని అడ్డుకున్నానని పవన్ స్పష్టం చేశారు.