పవన్ హీరోయిన్ ఇలా తయారయ్యిందేంటి?

0Pranitha-New-Lookప్రణీత సుభాష్.. తెలుగులో చేసినవి చాలా వరకు సెకండ్ హీరోయిన్ పాత్రలే అయినప్పటికీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్లతో నటించిన ఘనమైన ట్రాక్ రికార్డు ఆమెది. చాలా తక్కువ సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామందిని కవర్ చేసిన ప్రణీత.. ఏడాది నుంచి అడ్రస్ లేదు.

‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్ బస్టర్ మినహాయిస్తే.. ఆమె నటించిన మిగతా సినిమాలు చాలా వరకు తేడా కొట్టేయడంతో అమ్మడిపై నెగెటివ్ ముద్ర పడిపోయింది. వరుస ఫ్లాపులకు తోడు గ్లామర్ కూడా తేడా కొట్టేయడంతో ప్రణీత తెలుగు తెరకు దూరమైపోయింది.

ప్రణీత మళ్లీ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుందేమో అన్న సందేహాలు ఇంకేమైనా ఉంటే.. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటో షూట్ చూస్తే డౌట్లు క్లియరైపోతాయి. బిగ్ బజార్ ఫ్యాషన్ బ్రాండ్‌కు ప్రచారం చేసేందుకు వచ్చిన ప్రణీతను చూసి అందరూ షాకైపోయిన పరిస్థితి. జీరో సైజ్ కోసం ఏమైనా ట్రై చేస్తోందేమో కానీ.. ఆమె మరీ పీక్కుపోయి కనిపించింది. తెలుగులోనే కాదు.. అమ్మడికి మిగతా భాషల్లో కూడా ఇప్పుడు డిమాండ్ లేదు. ఏవో ఫొటో షూట్లు.. ఇలాంటి వాణిజ్య ఒప్పందాలతో నెట్టుకొస్తున్న ప్రణీత.. త్వరలోనే సినిమాలకు పూర్తిగా టాటా చెప్పేస్తే ఆశ్చర్యం లేదు.