చరణ్ తో వద్దని శీనుతోనా?

0ఆరెక్స్ 100లో ఇందుగా కామంతో రగిలిపోయే పాత్రలో పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ని ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిన యూత్ ఇప్పట్లో మర్చిపోవడం కష్టం. అంతలా మాయ చేసేసింది. దీని పుణ్యమా అని తన మీద ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది అనే మాట అబద్దం కాదు. అందుకే తన కొత్త సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న పాయల్ రెండో సినిమా దర్శకుడు భాను శంకర్ కు ఓకే చేసినట్టు సమాచారం ఉంది కానీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. దీని తర్వాత నిర్మాత సి కళ్యాణ్ తో ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు కోసం సైన్ చేసినట్టు టాక్ ఉంది. దాని ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా పాయల్ ఓ ఐటెం సాంగ్ కోసం ఓకే చెప్పిందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రూపొందుతున్న సినిమాలో పాయల్ ఓ ప్రత్యేకమైన సాంగ్ లో డాన్స్ చేసేందుకు ఓకే చెప్పిందట. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్.

ఇప్పుడు టాప్ హీరోయిన్లు ఐటెం సాంగ్ చేయటం కామన్ అయిపోయింది కాబట్టి ఒక్క సినిమా అనుభవం మాత్రమే పాయల్ ఇది చేయటం తప్పేమి కాదు. కాకపోతే తనకు బాగా నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పిన పాయల్ ఇలా ఐటెం సాంగ్ ఒప్పుకోవడం ఆశ్చర్యమే. పైగా రామ్ చరణ్ బోయపాటి శీను సినిమాలో కూడా ఇలాంటి ఆఫర్ వస్తే వద్దని చెప్పిందనే టాక్ గతంలో వచ్చింది. కానీ వీటి గురించి చెప్పడానికి పాయల్ ఈ మధ్య మీడియాకు అందుబాటులో లేదు. ఆరెక్స్ 100 ప్రమోషన్ పూర్తయ్యాక మైకు ముందుకు రాలేదు. ఆ మధ్య ఓ స్టేజి షోలో ఆడిపాడింది కానీ అంతకు మించి దర్శనం లేదు. మరి పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా చూస్తామా లేదా తొందరలో స్పెషల్ సాంగ్ లో చూస్తామా వెయిట్ చేసి చూడాలి.