మరోసారి ఆరబోసిన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ

0ఆర్ ఎక్స్ 100మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మరో అర్జున్ రెడ్డి మూవీ అంటూ ప్రేక్షకులు కితాబిస్తున్నారు. ఫుల్ రోమాంటిక్ యాంగిల్ ఉన్న ఈ మూవీకి యూత్ లో క్రేజ్ నెలకొంది. కలెక్షన్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఆర్ ఎక్స్ 100 మూవీలో ఏమాత్రం నో చెప్పకుండా బోల్డ్ సీన్లలో హీరోయిన్ పాయల్ నటించిన తీరు కుర్రకారు మతి పోగొడుతోంది.

చాలా మంది హీరోయిన్లు ఈ మూవీలో ఇంత బోల్డ్ గా నటించడానికి మొదట ఒప్పుకోలేదట..కానీ హీరోయిన్ గా తానేంటో నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే పాయల్ రాజ్ పుత్ తెలుగులో వచ్చిన ఈ అవకాశాన్ని చేజేతులా అందిపుచ్చుకొని అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఆర్ ఎక్స్ 100 గ్రాండ్ హిట్ తో పాయల్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. అవసరమైతే ఇక్కడే సెటిల్ అయిపోతాను అంటూ పాయల్ స్టేట్ మెంట్లు కూడా ఇస్తోంది.

ఆర్ ఎక్స్ 100 ఇచ్చిన జోష్ తో పాయల్ హాట్ హాట్ ఫొటోలకు ఫోజిస్తోంది. తాజాగా నిర్వహించిన ఫొటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన పొడుగు కాళ్ల సౌందర్యాన్ని చూపిస్తూ ఇచ్చిన ఈ ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ టాప్ ధరించి హోయలొలుకుతున్న పాయల్ ఫొటోలు చూశాక ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

payal-rajput-hot-photos-in-black-top-1