సాహసం చేశానన్న పాయల్

0ఇప్పుడు యువత ఆరెక్స్ 100 జపం చేస్తోంది. ఇన్ క్రెడిబుల్ లవ్ స్టోరీ ట్యాగ్ తో వచ్చిన ఈ మూవీ ఆ పేరుని సార్ధకం చేసుకునే దిశగా వసూళ్లు రాబడుతోంది. రెగులర్ హ్యాపీ ఎండింగ్స్ తో రొటీన్ కి అలవాటు పడిన ప్రేక్షకులు ఇందులో క్లైమాక్స్ ని తీర్చిద్దిన్న తీరుకు చాలా కొత్తగా ఫీల్ అవుతున్నారు. ఒకరకంగా ఇది కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక అందరి కంటే ఎక్కువ ఆకట్టుకుంది మాత్రం హీరోయిన్ పాత్ర ఇందు. సినిమా చూసి బయటికి వచ్చాక అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అనేలా పరకాయ ప్రవేశం చేసి మెప్పించిన పాయల్ రాజ్ పుత్ తన నెగటివ్ పాత్రకు పాజిటివ్ కామెంట్స్ రావడం పట్ల పట్ల ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి బోల్డ్ డేరింగ్ పాత్ర చేయాలంటే చాలా సాహసం ఉండాలని ఇవన్నీ తనలో ఉన్నాయి కాబట్టే కొందరు భయపెట్టినా ఆలోచించకుండా ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది. సక్సెస్ మీట్ లో విజయం తాలూకు ఆనందం ప్రతి ఒక్కరిలో కనిపించడం విశేషం.

ఒకరకంగా చెప్పాలంటే దర్శకుడు అజయ్ భూపతి హీరోయిన్ పాత్రకు ఉండాల్సిన పరిమితులను ముగింపు విషయంలో సూత్రీకరించబడిన విధానాలను పూర్తిగా మార్చి తీసినందుకు దానికి తగ్గ ఫలితాన్ని అందుకుంటున్నాడు. పాయల్ రాజ్ పుత్ సహజ నటనతో పాటు కోరికతో రగిలిపోయే ఇందూ పాత్రలో పైకి కనిపించకుండా లోలోపలే కుట్రలు చేసే పాత్ర తన ద్వారా రాబట్టుకున్న పెర్ఫార్మన్స్ కి ఈ రోజు థియేటర్స్ ఫుల్ అవ్వడానికి కారణం అవుతున్నాయి. దానికి తోడు భగ్న ప్రేమికుడిగా కార్తీక్ నటన పీక్స్ లో ఉండటంతో అన్ని కలగలిసి హిట్ కు దారి చూపాయి. ఇది సక్సెస్ అయ్యింది కాబట్టి ఇక హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు ఎలాంటి అవకాశాలు వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.