ఆర్గాజం గురించి మాట్లాడిన RX 100 భామ

0కొత్త హీరో హీరోయిన్లతో నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘RX 100’ సినిమా బాక్స్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విడుదలై రెండు వారాలవుతున్నా ఇంకా టికెట్ కౌంటర్ల దగ్గర సందడిగానే ఉంది. ఈ యూత్ ఫుల్ సినిమాలో తన బోల్డ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది.

మొదటి సినిమానే హిట్ కావడం.. అందులోనూ యాక్టింగ్ కూడా చక్కగా చేయడంతో పాయల్ కు టాలీవుడ్ ఫిలిం మేకర్స్ నుండి మంచి ఆఫర్లే వస్తున్నాయట కానీ ఇంకా తన రెండో సినిమాను సైన్ చెయ్యలేదు. RX 100 హడావుడి బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేలోపు ఆమె నెక్స్ట్ సినిమా ఏదో తెలిసే అవకాశం ఉంది.. అంతలోపు RX 100 సక్సెస్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా వైజాగ్ లో ఈ సినిమా సక్సెస్ మీట్ కు హాజరయింది కుడా. అక్కడ జనాల రెస్పాన్స్ చూసి పాయల్ థ్రిల్ అయింది.

ఆ తర్వాత తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి ‘ఒక చిరునవ్వుకు అర్గాజం ఉంటే అదే ..నవ్వు’ అని ట్వీటేసింది. మంచిదే… అర్గాజం అంటే జనాలు ఏదో అనుకుంటారు.. ఇది కూడానా.. హతవిధీ!