ఏనుగు అంబారీపై రెజీనాతో ఆట

0కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన నక్షత్రం మూవీ ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి బాగా వినిపిస్తున్న కామెంట్ ఏంటంటే.. పాటల్లో ప్రత్యేకించి హీరోయిన్స్ అందాలను చూపించడంలో మినహాయిస్తే.. ట్రైలర్ లో ఎక్కడా కృష్ణవంశీ మార్క్ కనబడలేదనే. ఏ పాయింట్ అయితే జనాలు బాగా గుర్తించారో.. దాన్నే ఇప్పుడు మరింతగా ప్రొజెక్ట్ చేస్తూ.. ముూవీపై ఆసక్తి కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్.

నక్షత్రం కోసం బాగానే పబ్లిసిటీ మెటీరియల్ రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో పాటకు రెండేసి వీడియో ప్రోమోల చొప్పున ఇప్పటికే విడుదల చేయగా.. ఇప్పుడు మేకింగ్ వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి. ‘పెదవికి నువ్వంటే ప్రాణం’ అంటూ సందీప్ కిషన్- రెజీనా కసాండ్రాలు పాడుకునే పాటకు.. ఇప్పుడు మేకింగ్ వీడియో కూడా వచ్చేసింది. దట్టమైన అడవిలో.. ఓ నీటి కొలను ప్రాంతంలో.. దాదాపు అరడజన్ చిన్నా పెద్దా ఏనుగులను తీసుకొచ్చి.. ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ఏనుగుల సంగతేమో కానీ.. చిత్రీకరణ కోసం వాటిని ప్రాపర్టీస్ గా వాడిన విధానం చూస్తే మాత్రం.. కృష్ణవంశీ మార్క్ కనిపిస్తుంది.

ఏనుగు పక్క నుంచి రెజీనా వస్తుంటే అది సడెన్ గా తొండం రెజీనాపై వేయడం.. ఏనుగుపైకి ఇద్దరిని ఎక్కించి రొమాన్స్ చేయించడం.. ఒక్కదాన్నే ఏనుగుపై చూపించడం లాంటి వన్నీ పిక్చరైజేషన్ కు బాగానే సమయం తీసుకున్నట్లున్నాయి. ఈ పాటను ఎన్ని రోజుల పాటు కష్టపడి తీశారో కానీ.. నక్షత్రం మూవీలో ఆన్ స్క్రీన్ పై ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచేట్లు కనిపిస్తోంది.