#పెనివిటి: గురూజీ ఇలా జరిగిందేవిటి?

0

‘అరవింద సమేత’ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి #పెనివిటి పాట వీడియో ప్రోమో ను రిలీజ్ చేశారు. పెనివిటీ సాంగ్ విన్నవారికి.. ఆ లిరిక్స్ ను గమనించిన వారికి అదెలా అనిపించిందంటే కత్తిబట్టి కొట్లాటకు ఊరిమీదకు పోయిన భర్తకోసం భార్య పాడే ఎమోషనల్ పాట. దీంతో ఇదో సిచ్యుయేషనల్ సాంగ్ అని.. మోంటేజ్ షాట్స్ ఉండే అవకాశం ఉందని ఊహించారు.

మీరు కూడా అలా ఊహించి ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ పాటను ఎన్టీఆర్ మీద చిత్రీకరించడం దాదాపుగా అందరికీ సర్ ప్రైజ్ చేసింది. కొందరు అయితే షాక్ అయ్యారు. ఎన్టీఆర్ బాధగా డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పటికీ.. ఆ లిరిక్స్ ఏంటి ఈ చిత్రీకరణ ఏంటి.. అని ఇప్పటికే కొదరు కామెంట్ చేయడం మొదలు పెట్టారు. కొంతమందయితే గురూజీ ఈమధ్య లిరిక్స్ కు సంబంధం లేకుండా చిత్రీకరణ చేయడం మొదలు పెట్టాడని.. ‘అజ్ఞాతవాసి’లో ‘బయటకొచ్చి చూస్తే 2 ఓ క్లాక్’ సాంగ్ కూడా అలాగే ఉంటుందని.. లిరిక్స్ కి పిక్చరైజేషన్ కు సెంటిమీటర్ కూడా సంబంధం ఉండదని గుర్తు చేస్తున్నారు.

మరో వైపు గురూజీ సపోర్టర్స్ మాత్రం ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ చెబుతూ అందులో భాగంగా సీమలో ఆడవాళ్ళ బాధల గురించి ఇలా పాట రూపంలో వివరిస్తాడని వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా ఫిమేల్ వెర్షన్ సాంగ్ ను ఎన్టీఆర్ మీద చిత్రీకరించడం పైగా ఎన్టీఆర్ స్టెప్స్ వేయడం కొందరికి మింగుడు పడడం లేదు.. అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా. మీరు చూసి డిసైడ్ చెయ్యండి. నచ్చితే కుంపటి.. సంకటి..పెనివిటి.. దుప్పటి అని ప్రాస పదాల మీద ఒక వాక్యం రాయండి. ఆదివారం కదా టైంపాస్ అవుతుంది..!
Please Read Disclaimer