ఇండోనేసియ ను తాకిన బాహుబలి పాట

0మనుషులు భావాలు ఎక్కడైనా ఒకటే కాకపోతే వాటి రూపాలు వ్యక్తపరిచే తీరులే వేరుగా ఉంటాయి. సినిమాకు కూడా భాష అవసరం లేదు ఎందుకంటే సినిమా అనేది కూడా ఒక కథే కాబట్టి అది చెప్పేది కూడా మనుషులు భావాలే కాబట్టి మనకు భాష రాకపోయినా అర్ధం అవుతుంది. మరి అలాంటప్పుడు సినిమాకన్నా ముందు పుట్టిన సంగీతానికి కూడా భాష లేదు అనేది అందరికి తెలిసిన సత్యమే. రాగాలుకు ఆధారం మన భావాలే కాబట్టి దానికి కూడా భాషతో పని లేదు. ఇక్కడ ఒక ఇండోనేసియన్ మ్యూజిక్ బ్యాండ్ కూడా అలానే వాళ్ళకి అర్ధం కానీ భాషని అదిగమించి భావాన్ని అర్ధం చేసుకొని గొప్పగా పాడి వినిపించారు అక్కడ వాళ్ళకి.

బాహుబలి సినిమా ఎంతటి ఘన విజయం పొందిందో అందరికి తెలిసిందే. రికార్డులు కలెక్షన్లు గురించి కాకుండా వీటి అన్నింటికీ అతీతంగా కొంతమంది ఈ సినిమాలో అమ్మ-కొడుకు మధ్య బందాన్ని రాజనీతిని అర్ధం చేసుకొని ‘సాహోరే బాహుబలి’ పాటను వాళ్ళ జీవితాలుకు చక్కగా ఆకళింపు చేసుకున్నారు. ఇండోనేషియా వాళ్ళు మన భాషలో నమస్తే అనే పదాన్ని పలకడానికే కష్టపడతారు అటువంటిది ఇక్కడ కొంతమంది సంగీతకళాకారులు మన బాహుబలి పాటను తెలుగులో పాడి భావాన్ని ఎక్కడా తప్పు దొర్లకుండా వినిపించారు. ఈ వీడియొ చూసిన ఏ సంగీత ప్రియుడైన ముఖ్యంగా తెలుగు వాళ్ళు చాల సంతోషపడిపోతున్నారు. నిజమే మరి వాళ్ళు అంత వినయంగా సమర్పించారు మన సంగీతాన్ని.

ఏది ఏమైనా బాహుబలి క్రేజ్ ఇంకా ఎక్కడో ఒక చోట మోగుతూనే ఉంది. బాహుబలి సినిమా చాలా రంగాలలో మార్పును తీసుకువచ్చింది. కథను నమ్మి మంచి స్థాయి లో అందించగలిగితే దానికి ఏ హద్దులు అడ్డురావు అని నిరూపించింది. మరో సారి జైహో బాహుబలి అని మనం కూడా అనాల్సిందే.