లీట‌రు పెట్రోలు 30 రూపాయ‌ల‌కా?

0petrol-picమ‌రో ఐదు సంవ‌త్స‌రాల్లో పెట్రోలు ధ‌ర‌లు స‌గానికి స‌గం త‌గ్గ‌నున్నాయ‌ని సంచ‌ల‌న వార్త ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది. అవునండి ఇదీ నిజం.అంత‌ర్జాతీయంగా పెట్రోల్‌ ధరలకు సంబంధించిన న‌మ్మ‌శ‌క్యం కాని అంచనాలు వెలువడ్డాయి. రాబోయే 5 సంవ‌త్స‌రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.30 ల కంటే దిగువకు ప‌డిపోతుంద‌ని చెబుతున్నారు. అమెరికన్ భ‌విష్య‌కారుడు టోనీ సెబా ప్రకారం ఐదు సంవత్సరాలకు లీటరు పెట్రోల్‌ రూ. 30 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని తెలుస్తోంది.దీని గురించిన మరిన్ని ఆస‌క్తిక‌ర అంశాలు మీ కోసం…

బారెల్ 25 డాల‌ర్ల‌కు

సెబా ప్రకారం, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల కారణంగా చమురు డిమాండ్‌ గణనీయంగా త‌గ్గిపోతుంది. ముఖ్యంగా చమురు బ్యారెల్‌ ధర త్వరలోనే 25 డాలర్లకు దిగిరానుంది. ఇది 2020 నాటికి చమురు గిరాకీ గ‌రిష్ట స్థాయి 100 మిలియన్ బారెల్స్‌కు వెళ్లి, పది సంవత్సరాలలో 70 మిలియన్ బారెల్స్ పడిపోతుందని సెబా అంచనా. సీఎన్‌బీసీ మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు.

విద్యుత్ ఆధారిత కార్ల(ఎల‌క్ట్రికల్ కార్లు) వినియోగం

పాతకార్లు వాడ‌కాన్ని ప్ర‌జ‌లు మ‌రిచిపోకున్నా విద్యుత్ ఆధారిత కార్ల వినియోగం భారీగా పెరగనుందన్నారు. ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడంతో పాటు, ఈ వాహనాల ధరలు కూడా చెప్పుకోద‌గ్గ స్థాయిలో అందుబాటులోకి రానున్నాయ‌ని సెబా చెబుతున్నారు. అలాగే 2030నాటికి 95శాతం ప్రజలు ప్రైవేటు వాహనాలకు స్వస్తి చెబుతారని, దీంతో ఆటో మొబైల్‌ పరిశ్రమ తుడిచుపెట్టుకుపోతుందని పేర్కొన్నారు. అంతేకాదు విద్యుత్తు వాహనాల రాకతో ప్రపంచ ముడి చ‌మురు పరిశ్రమ కుదేలవుతుందని అంచనావేశారు.

భార‌త్‌లో ఎల‌క్ట్రిక్ కార్ల రాక ఎప్పుడో…

కాగా సిలికాన్ వ్యాలీ వ్యవస్థాపకుడు, స్టాన్‌ఫర్డ్ కాంటినెనింగ్ స్టడీస్ ప్రోగ్రాంలో డిస్ప్ప్షన్ అండ్ క్లీన్ ఎనర్జీలో బోధకుడుగా ఉన్నారు సెబా. సౌర శక్తి మీద సేబా ఊహ నిజం కావడంతో చమురు ధరల భవిష్యత్తు పై అంచనాలు కూడా నిజంకావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ అంచనాలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ ఇటీవలి వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. 2030 నాటికి భారతదేశం లో ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయని ప్రకటించారు. అలాగే 15 సంవత్సరాల తర్వాత దేశంలో ఒక్క పెట్రోల్ లేదా డీజిల్ కారు విక్రయించబడదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

సౌర విద్యుత్‌కు సంబంధించి ఆయ‌న అంచ‌నా నిజ‌మైంది

ఇది వ‌ర‌కే సౌర విద్యుత్‌కు భారీగా డిమాండ్‌ పుంజుకోనుందని అంచనావేసిన సెబా తాజాగా చమురు ధరలపై తన అంచనాలను వెల్లడించారు. ఇదే నిజ‌మైతే ప్రపంచ ఇంధ‌న రంగంలో ఇది ఒక పెను మార్పును సృష్టించ‌గ‌ల‌దు. రాబోవు రోజుల్లో మెరుగుప‌డ‌నున్న సాంకేతిక‌త‌ పెట్రోలుపై ఆధారపడటాన్ని తగ్గించనుందని తెలిపారు.

16 ఏళ్ల గ‌రిష్టానికి డిమాండ్‌

2016లో భార‌త‌దేశ పెట్రోల్ డిమాండ్ గ‌త 16 సంవ‌త్స‌రాల్లోనే అత్య‌ధికం. ఎందుకంటే ఏడాదంతా కాస్త పెట్రోలు ధ‌ర‌లు నియంత్ర‌ణ‌లో ఉండటం, ఏవియేష‌న్ ఫ్యూయ‌ల్‌, పెట్రోలుకు డిమాండ్ నెల‌కొన‌డం ఇందుకు కార‌ణం. 2016 సంవ‌త్స‌రంలో ఇంధ‌న‌ డిమాండ్ 10.7% పెరిగి 196.49 మిలియ‌న్ ట‌న్నుల‌కు పెరిగిన‌ట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాల‌సిస్ సెల్ వెల్ల‌డించింది.