ముగిసిన తుది విడత పోలింగ్‌

0ap-polls-resultsహైదరాబాద్‌: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలైన్‌లో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతించనున్నట్లు రాష్ట్రం ఎన్నికల సంఘం తెలిపింది.

మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశముంది. తొలుత వార్డు సభ్యుల ఓట్లు, ఆతర్వాత సర్పంచి ఓట్లు లెక్కించనున్నారు. తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేందుకు ఓటర్లు ఇబ్బంది పడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్దిరెడ్డిపాలెంలో స్థానికులు బ్యాలెట్‌ బాక్సులు ఎత్తుకెళ్లి బావిలో పడేశారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేసి, పోలింగ్‌ కేంద్రంపై రాళ్ల వర్షం కురిపించారు. రాళ్లదాడిలో గాయపడిన ఎస్‌.ఐ భుజంగరావు స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల తెదేపా, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

AP Panchayat Election Results 2013

AP Panchayat Election Results 2013, Live Updates: AP Gram Panchayat Elections Results, Gram Panchayat Elections live, Gram Panchayat polls live, Panchayat polls live updates, Panchayat elections Live, AP Panchayat polls results, AP Panchayat elections results, Panchayat elections results live, Live Updates: AP Gram Panchayat Elections