తనూశ్రీపై దాడి.. ఇదీ షాకింగ్ నిజం

0

బాలీవుడ్ కథానాయిక తనూశ్రీ దత్తా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు. సీనియర్ నటుడు నానా పటేకర్ తనని లైంగికంగా వేధించాడని – ఆ క్రమంలోనే ఓ సినిమా సెట్స్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని తనూశ్రీ ఓ టీవీ చానెల్ లైవ్ లో చెప్పడం సంచలనమైంది. ఆ క్రమంలోనే నానాకు వ్యతిరేకంగా తనూశ్రీకి మద్ధతు పలుకుతూ పలువురు బాలీవుడ్ కథానాయికలు నోటికి పని చెప్పారు. ఆ క్రమంలోనే నిన్నటిరోజున ఊహించని ఓ ట్విస్టు.

ఇదిగో ఇదే తనూశ్రీపై దాడి చేయించిన ఫుటేజ్! అంటూ మీడియా ఒకటే హడావుడి చేసింది. ఆ వీడియోలో ఓ మీడియా కెమెరామెన్ తనూశ్రీ కార్ అద్దాల్ని పగలగొట్టడం – అటుపై టాప్ పైకి ఎక్కి నానా రచ్చ చేయడం కనిపించింది. వెళుతున్న కార్ ని అడ్డగించి గాలి తీసేయడం స్పష్టంగా కనిపించడం చూస్తే ఎంత దుర్మార్గం అనుకున్నారంతా. ఆ క్రమంలోనే ఆ పని చేయించింది నానానే.. అంటూ నానా పటేకర్ ని దోషిని చేస్తూ అతడే తనూశ్రీ కార్ పై దాడి చేయించాడని ఓ వీడియోని చానెళ్లు లైవ్ చేశాయి. అంతేకాదు.. ఈ వీడియో యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోయింది. అయితే అసలు ఇది నిజమేనా? అసలు ఆ ఘటనలో వాస్తవమెంత? అన్న లాజిక్ ని మాత్రం ప్రపంచం మర్చిపోయింది.

అయితే అందులో వాస్తవమెంత? అంటూ ప్రఖ్యాత `బాలీవుడ్ హంగామా` చేసిన పరిశోధనలో అసలు నిజం నిగ్గు తేలింది. వాస్తవానికి ఆ గొడవ పూర్తిగా ఓ స్టిల్ ఫోటోగ్రాఫర్ కి సంబంధించినది. తనూశ్రీ దత్తా సదరు లొకేషన్ నుంచి హడావుడిగా వెళ్లిపోతోంది. కార్ లో తనతో పాటే డాడ్ కూడా ఉన్నారు. ఆ క్రమంలోనే అక్కడ వేచి చూస్తున్న ఫోటో జర్నలిస్టు కెమెరాని లాక్కుని తనూశ్రీ తండ్రి చితక్కొట్టారట. దాంతో కోపం వచ్చిన సదరు ఫోటో జర్నలిస్టు కెమెరా డ్యామేజ్ కు కాంపన్ సేషన్ అడిగారు. కానీ అతడు ఇవ్వకుండా కార్ ని పరుగులు పెట్టించారు. ఆ క్రమంలోనే సదరు ఫోటో జర్నలిస్టు కాలి పైకి కార్ ఎక్కింది. వేరొక అమ్మాయి పైకి దూసుకెళ్లింది. ఈ సంగతులన్నీ ఆ ఫోటోగ్రాఫర్ స్వయంగా తెలిపాడు. తన కెమెరా డ్యామేజ్ అయినందుకు ఆ బిల్లు చెల్లించమని అడిగానని తెలిపాడు. ఒక ఇంటర్న్ షిప్ కోసం సదరు స్టూడియోకి – లొకేషన్ కి వచ్చిన తనకు తీరని నష్టం వాటిల్లిందని – ఆ క్రమంలోనే ఆ తర్వాత తనూశ్రీ తండ్రితో సెటిల్ మెంట్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చానని వెల్లడించాడు. ఇకపోతే ఆ స్టూడియోలో ఏదో జరిగాక తనూశ్రీ హడావుడిగా వెళ్లిపోవడం చూశానని అతడు చెప్పడం విశేషం. ఇదంతా చూస్తుంటే తనూశ్రీ ఆరోపణల్లో నిజం ఎంత? అన్నదానిపై లోతుగా దర్యాప్తు సాగాల్సి ఉందని భావించాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో వ్యక్తిగత కక్షలు కొన్నిటికి కారణం అవుతాయి. తొందరపడి ఎవరో ఒకరిని నిందించడం కరెక్టు కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Please Read Disclaimer