బికినీ అందాల పందేరమిది!

0అందాల కథానాయిక యామిని భాస్కర్ జమానా కాలంలో టాలీవుడ్ లో ప్రవేశించి ఇప్పటికీ అదృష్టం పరీక్షించుకుంటూనే ఉంది. అప్పట్లో కోటి తనయుడు రాజీవ్ సాలూరి సరసన ఓ చిత్రంలో నటించింది. అయితే లక్ కలిసిరాక ఆ సినిమా ఫ్లాపైంది. ఆ తర్వాతా నటించినవేవీ సక్సెస్ కాలేదు. ఆ క్రమంలోనే తెలుగు – తమిళంలో సీరియస్ గానే ట్రై చేసింది. ఇంతకాలానికి నాగశౌర్య రూపంలో ఓ అవకాశం అదృష్టంగా మారింది.

ప్రస్తుతం ఈ భామ వరుస సక్సెస్ లతో జోరుమీదున్న శౌర్య సరసన `నర్తనశాల` చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా టైటిల్ – పోస్టర్ సహా టీజర్లు – పాటలు ఆకట్టుకున్నాయి. లేటెస్టుగా “పిచ్చిపిచ్చిగా నచ్చావురా ..“ అంటూ అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. ఈ వీడియో సాంగ్ లో యామిని భాస్కర్ అందచందాలు కుర్రకారుకు వీనులవిందు అనే చెప్పాలి. బికినీ బీచ్ లో యామిని రొమాంటిక్ ఫోజులు మతిచెడేట్టు చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సముద్ర తీరంలో యామిని రకరకాల భంగిమల్లో స్టెప్పులేస్తూ యువతరాన్ని మైమరిపిస్తోంది.

ఇంత చేస్తున్నందుకైనా.. ఈ సినిమాతో యామిని కల నెరవేరుతుందేమో చూడాలి. హిట్టు వెంటపడే టాలీవుడ్ లో ఆ ఒక్క హిట్టు చాలా ఇంపార్టెంట్. యంగ్ గాళ్ యామినిలో ప్రతిభకు కొదవేం లేదు. యువ హీరోలకు సరిపడే ఫిజిక్ – ఫిజిక్స్ తన సొంతం. హీరోలతో కెమిస్ట్రీలోనూ స్పీడే! చూద్దాం.. నర్తనశాల ఈ నెల 30న రిలీజవుతోంది. ఛలో – అమ్మమ్మగారిల్లు తర్వాత హ్యాట్రిక్ పై కన్నేసిన నాగశౌర్యకు ఈ మూవీ విజయం సాధించడం ఎంతో ఇంపార్టెంట్. శ్రీనివాస చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగశౌర్య సొంత ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.