పవన్‌ టైటిల్‌ పవర్‌ ఎంతో…?

0pilla-nuvvu-leni-jeevitham-titleగబ్బర్‌సింగ్‌ పుణ్యమా అని తెలుగు సినిమా టైటిళ్ల కొరత తీరుతోంది. కెవ్వుకేక, గుండెజారి గల్లంతయ్యిందే ఇప్పటికే టెటిళ్లయిపోయాయి. ఇప్పుడు మరో పాట.. పిల్లా నువ్వులేని జీవితం కూడా సినిమా టైటిల్‌ గా మారిపోయింది. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రెజీనా నాయిక. ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. ఈ చిత్ర నిర్మాణంలో మెగా నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌ రాజులు కూడా ఉన్నారు. 

పిల్లా నువ్వు లేని జీవితం లోగో లాంఛ్‌ కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్‌ లో జరిగింది. ‘ఈ టైటిల్‌ ముందుగా చెప్పింది దిల్‌ రాజు గారే. మా సినిమాకి సరిగ్గా సరిపోతుంది అని పెట్టేశాం’ అని దర్శకుడు చెప్పారు. ‘దేవిశ్రీ ప్రసాద్‌ నాచేత బలవంతంగా రిజిస్టర్‌ చేయించిన టైటిల్‌ ఇది. ఈ సినిమాకి పనికొచ్చింది’ అంటున్నారు దిల్‌ రాజు. 

పవన్‌ మానియా బాగా పెరిగిపోయింది. వవన్‌ అభిమానుల్ని ఆకట్టుకొంటే సరిపోతుంది అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు చాలామంది. పైగా సాయి ధరమ్‌ తేజ్‌ మెగా వారసుడు. పవన్‌ ఆశీస్సులు కూడా మెండిగా ఉన్నాయట. మరి పవన్‌ పాట మంత్రం మేనల్లుడికి ఎంత వరకూ కలసొస్తుందో చూడాలి.

Tags : పవన్‌ టైటిల్‌ పవర్‌ ఎంతో…? , Sai dharma tej, Pawan Kalyan, Allu Aravind, regina, Pilla Nuvvu leni Jeevitham, Dilraju