సన్నీ టాప్ లెస్.. ఫ్యాన్స్ హర్టయ్యారు

0ఇప్పుడు సన్నీ లియోన్ టాప్ లెస్ సీన్ అనగానే.. ఇంకా ఆ సీన్లకు బోలెడన్ని విజిల్స్ పడుతున్నాయ్. బోలెడన్ని గుండెలు కరుగుతున్నాయ్. డెఫినట్ గా కూడా ఇదంతా ఆమె అందాల తాలూకు ప్రభావం అనే చెప్పాలి. ఆల్రెడీ ఆమె ఎన్నిసార్లు టాప్ లెస్ గా బ్యాక్ నుండి కినిపించినప్పటికీ.. మల్ళీ మళ్ళీ మన మేకర్లు అదే ఫీట్ చేయిస్తుంటారు. ఆ మద్యన అలాంటి సీన్లు చేయను అని చెప్పిన ఈ శృంగార దేవత ఇప్పుడు మరోసారి అదే చేసింది.

త్వరలో విడుదలవ్వనున్న ‘బాద్షాహో’ సినిమాలో అమ్మడు ఒక చిన్న రోల్ పోషిస్తోంది. ఆ చిన్న రోల్ ఎందుకంటే.. ఒక ఐటెం సాంగులో ఈమె పాల నురుగుల అందాలను దారబోయడానికే. అయితే అమ్మడు ఈ సినిమాలో పియా మోరే అంటూ హీరో ఇమ్రాన్ హష్మితో కలసి ఈ పాటను చేసింది. పైగా ఒక వైన్ బారెల్ లో అమ్మడు పీక వరకు టాప్ లెస్ గా మునిగితే.. ఇమ్రాన్ ఆమెతో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. కాని ఈ మొత్తం యవ్వారం అతగాడి ఫ్యాన్స్కు నచ్చలేదు. ఈ పాట వీడియో రిలీజైంది మొదలు.. లవర్ బాయ్ గా ఎంతో ఫేమస్ అయ్యుండి చివరకు సన్నీతో ఇలాంటి రొమాన్సులు చేసుకుంటావా అంటూ తిట్టిపోస్తున్నారు.

అయితే ఫ్యాన్స్ ఇలా హర్టవ్వడంలో అసలు అర్ధమేలేదని చెప్పాలి. ఎందుకంటే సన్ని లియోన్ కు ఉన్న బ్రాండ్ ఇమేజే వేరు. సాక్షాత్తూ షారూఖ్ ఖాన్ సైతం రయీస్ సినిమాలో అమ్మడితో లైలా ఓ లైలా అంటూ సాంగేసుకోక తప్పలేదు. అంత పెద్ద ఖాన్ కే తప్పనప్పుడు ఇక్కడ హష్మి ఎంతండీ బాబూ.. వీళ్ళూ వీళ్ల కామెడీలు.