పీకే టాటూ వేయించుకున్న హీరోయిన్

0poonam-pk2006లో ఎస్ వీ కృష్ణా రెడ్డి తెరకెక్కించిన మాయాజాలం చిత్రంతో తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన భామ పూన‌మ్ కౌర్. ఒక విచిత్రం, శౌర్యం, నాగావ‌లి, గ‌గ‌నం, ఎటాక్, నాయ‌కి వంటి చిత్రాల‌లో న‌టించిన ఈ అమ్మ‌డికి స‌రైన గుర్తింపు ల‌భించ‌లేదు. అయితే రీసెంట్ గా ఈ అమ్మడు త‌న పెళ్ళి తో పాటు చేసుకోబోయే వ్య‌క్తికి ఎలాంటి క్వాలిటీస్ లో ఉండాలో వివ‌రించింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ లా సింప్లిసిటీగా ఉండ‌డంతో పాటు నిజాయితీ, ముక్కు సూటిత‌నం ఉండాల‌ని పేర్కొంది. ఇండియా ఫిలిం ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుల‌లో ప‌వ‌న్ కూడా ఒక‌ర‌ని పూనమ్ పేర్కొంది. అయితే రీసెంట్ గా పూన‌మ్ కౌర్ కి సంబంధించిన ఒక ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌గా, ఆ పిక్ లో పూనమ్ చెస్ట్ పై పీకే టాటూ ఉండ‌డంతో దీనిపై ప‌లువురు ప‌లు ర‌కాలుగా చెబుతున్నారు. ప‌వ‌న్ పై త‌న‌కున్న అభిమానాన్ని పూన‌మ్ ఇలా ప్ర‌ద‌ర్శిస్తుందా అని అంటున్నారు.