మోడీ వల్ల మహేష్ సినిమాకు బ్రేక్

0భరత్ అనే నేను సినిమాతో సేఫ్ జోన్ లోకి వచ్చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ తన 25వ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కున్న ఆ సినిమా షూటింగ్ ఇటీవల డెహ్రడూన్ లో మొదలైంది. అయితే కరెక్ట్ ప్లాన్ తో సెట్ చేసుకున్న మొదటి షెడ్యూల్ లోనే సినిమాకు ఎవరు ఊహించని విధంగా బ్రేకులు పడ్డాయి. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్లే.

దీంతో చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకోక తప్పలేదు. డెహ్రాడూన్ లోని ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యుట్ లో కొన్ని రోజుల క్రితం షెడ్యూల్ ని స్టార్ట్ చేశారు. అయితే యోగా దినోత్సవ సందర్బంగా అక్కడి ప్రాంతాన్ని నెల రోజుల ముందే తీసుకున్నారట. రెండు నెలల పాటు మహేష్ గ్యాంగ్ అక్కడ షూటింగ్ చేయాల్సింది. ఇక ప్రైమ్ మినిష్టర్ బుక్ చేసుకోవడంతో వెనుకడుగు వేయక తప్పలేదు. యోగ సెలబ్రేషన్స్ సందర్బంగా భారీ సంఖ్యలో జనాలు వస్తారు. అందుకే షూటింగ్ ని నెల పాటు వాయిదా వేసుకోవడం బెటర్ అని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ను డిసెంబర్ మొదటి వారంలోగా ఫినిష్ చేయాలనీ నిర్మాత దిల్ రాజు అనుకున్నారు. కాని ఇంకా అధికారికంగా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. చూస్తుంటే ఆలస్యం అవుతోంది కాబట్టి కూల్ గా సమ్మర్ లో వచ్చే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాకో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటించనున్నారు. సి.అశ్వినీదత్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.