ప్ర‌ణ‌బ్ గుండెను తాకిన మోదీ లేఖ‌

0narendra-modis-letter-pranabన్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాసిన ఓ లేఖ మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని గుండెను తాకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో త‌న చివ‌రి రోజు సంద‌ర్భంగా మోదీ ఆయ‌నకు ఓ వీడ్కోలు లేఖ రాశారు.

ఇప్పుడా లేఖ‌ను ట్విట్ట‌ర్‌లో అంద‌రితోనూ పంచుకున్నారు ప్ర‌ణ‌బ్‌. ఆయ‌న త‌న తండ్రి స‌మానుడ‌ని, గురువుగా భావిస్తాన‌ని ఆ లేఖ‌లో మోదీ రాశారు. ప్ర‌ణ‌బ్ నిరాడంబ‌ర‌త‌, అత్యున్న‌త విలువ‌లు, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను మోదీ ఎంత‌గానో అభినందించారు.

మూడేళ్ల కింద‌ట ఓ బ‌య‌టి వ్య‌క్తిగా నేను ఢిల్లీలో అడుగుపెట్టాను. నా ముందు ఎన్నో పెద్ద స‌వాళ్లు ఉన్నాయి. ఈ క్లిష్ట స‌మ‌యంలో నాకు మీరు ఓ తండ్రిలాగా, గురువులాగా వ్య‌వ‌హ‌రించారు. మీ జ్ఞానం, మార్గ‌ద‌ర్శ‌నం నాకు మ‌రింత ఆత్మ‌విశ్వాసాన్ని, బ‌లాన్ని ఇచ్చాయి అని మోదీ ఆ లేఖ‌లో అన్నారు. ప్ర‌ణ‌బ్ మేథో సంప‌త్తి త‌న‌కు, త‌న ప్ర‌భుత్వానికి ఎంత‌గానో సాయ‌ప‌డ్డాయ‌ని మోదీ చెప్పారు.

రోజూ ఎన్నో ప‌నుల్లో బిజీగా ఉన్నా.. సాయంత్రం మీరు ఫోన్లో నా ఆరోగ్యం గురించి అడ‌గితే చాలు అన్ని ఒత్తిళ్ల‌ను మ‌ర‌చిపోయేవాడిన‌న ఆయ‌న ఆ లేఖ‌లో రాశారు. మీతో క‌లిసి ప‌నిచేయ‌డం ఓ గౌర‌వంగా భావిస్తున్నా అని లేఖ‌ను ముగించారు.