ఎమ్మెల్యే రోజాని ఈడ్చుకెళ్లారు

0దాచేపల్లి మైనర్ బాలిక అత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకొంది. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. తాజాగా, అత్యాచారానికి నిరసనగా గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఎదుట వైకాపా ధర్నాకు దిగింది.

బాధితురాలిని పరామర్శించేందుకు వైసీపీ ఎమ్మెల్యే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో బాలికను పరామర్శించిన అనంతరం ఆసుపత్రి బయట ఆమె సహచర ఎమ్మెల్యేలతో కలిసి ధర్నాకు దిగింది. పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ ధర్నాని ఆపు చేసే ప్రయత్నం చేశారు. ఐతే, పోలీసులు ఎంత చెప్పినా రోజా వినలేదు. చివరకు ఆమెని పోలీసులు ఈడ్చుకెళ్లి ఫ్యాన్ ఎక్కించారు. దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.