జయలలిత సమాధి వద్ద పోలీసు ఆత్మహత్య

0తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద ఆదివారం ఉదయం కలకలం రేగింది. పోలీస్‌ కానిస్టేబుల్‌ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకెళితే.. మధురైకి చెందిన అరుల్‌ అనే వ్యక్తి మెరీనా తీరం వద్ద ఉన్న అమ్మ సమాధి వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు.ఈ రోజు డ్యూటీకి వెళ్లిన అరుల్‌ సమాధి వద్దకు చేరుకోగానే తన రైఫిల్‌తో కాల్చేసుకున్నాడు. అది గమనించిన తోటి పోలీసులు వెంటనే అరుల్‌ని దగ్గర్లోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కానీ అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే అరుల్‌ ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్పడ్డాడన్నది తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.