నటుడి భార్య విచారణ.. వెక్కివెక్కి ఏడ్పు

0Kavya-Madhavan-cryingకేరళలో ప్రముఖ నటి కిడ్నాప్‌, లైంగిక వేధింపుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న మలయాళ నటుడు దిలీప్‌ భార్య కావ్య మాధవన్‌ను కూడా విచారించినట్లు కేరళ పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఏవీ గార్జ్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘మంగళవారం కావ్యమాధవన్‌ను ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతానికి నేను ఈ విషయాన్ని మాత్రమే స్పష్టం చేయగలను. ఇంతకుమించి ఎలాంటి సమాచారం అందించలేను’ అని ఆయన తెలిపారు.

దిలీప్‌ పూర్వీకుల నివాసానికే వెళ్లిన అధికారులు అక్కడే ఆమెను దాదాపు ఆరుగంటలపాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సమయంలో పలుమార్లు ఏడ్చినట్లు సమాచారం. దిలీప్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన కేరళ హైకోర్టు ఆగస్టు 8 వరకు ఆయనను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.