చికాగో సెక్స్ రాకెట్ పోలీస్ రిపోర్ట్ ఇదే..

0అమెరికాలోని చికాగో కేంద్రంగా జరుగుతున్న టాలీవుడ్ సెక్స్ రాకెట్ బట్టబయలైన సంగతి తెలిసిందే. నిందుతులు కిషన్ మోదుగుమూడి-చంద్ర దంపతులు చేసిన నిర్లక్ష్యమే వారిని కటకటాలు పాలు చేసింది. 2017 నవంబర్ 20న ఓ నటి చేసిన తప్పు ఇప్పుడు కిషన్ దంపతులను దొరికిపోయేలా చేసింది. కాలిఫోర్నియాలో నిర్వహించిన స్టార్ నైట్ కార్యక్రమంలో పాల్గొనడానికి కిషన్ దంపతులు ఈ నటికి లెటర్ పంపారు. ఈవెంట్ నిర్వాహకుల లేఖ ఆధారంగా వీసాతో ఆమెరికాకు ఆ నటి వచ్చింది. అయితే 18వ తేదీ కార్యక్రమం ఉంటే రెండు రోజులు ఆలస్యంగా 20న వచ్చేసింది. స్టార్ నైట్ కార్యక్రమం ముగిసి రెండు రోజులు కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

సదురు నటిపై పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా తాను త్వరలో జనవరి 25న జరిగే నాట్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చానని చెప్పింది. సదుదు పోలీసులు నాట్స్ ఈవెంట్ నిర్వాహకులను సంప్రదించారు. అసలు ఆరోజు ఎలాంటి కార్యక్రమం తాము నిర్వహించడం లేదని వారు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ నటిని వెంటనే అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రశ్నించగా.. కిషన్ దంపతుల సెక్స్ రాకెట్ బయటపెట్టింది. ఆ వివరాల ఆధారంగా పోలీసులు లోతుగా పరిశోధించి కిషన్-చంద్రల సెక్స్ రాకెట్ ను కదిలించారు.

అనంతరం కిషన్ -చంద్రల ఇంటిని సోదా చేయగా వ్యభిచార నిర్వహణకు సంబంధించి అనేక ఆధారాలు లభించాయి.దాదాపు 70 కండోమ్స్ తో పాటు కిషన్ భార్య చంద్రకళ రాసుకున్న డైరీ ఈ వ్యవహారంలో ప్రధాన ఆధారంగా పోలీసులకు దొరికింది. తాజాగా చికాగో పోలీసులు దాఖలు చేసిన చార్జి షీట్లో హీరోయిన్ల పేర్లు పేర్కొనకుండా ఏ – బీ – సీ – డీ అని పేర్కొన్నారు. ఈ సెక్స్ రాకెట్ ఎలా దొరికిపోయిందో ఆ చార్జిషీట్ లో పేర్కొన్నారు.

*ఏ హీరోయిన్ చేసిన పొరపాటే పట్టించింది..

ఏ హీరోయిన్ ఢిల్లీ నుంచి 2017 నవంబర్ 20న అమెరికాలోని ఓహారె ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో దిగింది. ఆమె ఇమ్మిగ్రేషన్ అధికారులకు తన బి1బీ2 వీసా చూపించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా (టాస్క్) నవంబర్ 18న నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని తెలిపింది. ఇక్కడే మిస్టేక్ చేసింది. 20వ తేదీన దిగి 18వతేదీ ప్రోగ్రాంకు హాజరు కావడానికి వచ్చానని తెలుపడంతో దొరికిపోయింది. తీగ లాగితే డొంక అంతా కదిలింది. శ్రీరాజ్ అనే వ్యక్తి తనకు ఈమెయిల్ ద్వారా ఆ లేఖలు పంపాడని..అమెరికాలోని ఓ సంస్థ కోసం అతడు పనిచేస్తున్నాడని హీరోయిన్ తెలిపింది. అతడి ఫోన్ నంబర్ ను కూడా అమెరికా పోలీసులకు ఇచ్చింది. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా సెక్స్ రాకెట్ ను పోలీసులు చేధించారు.

*చంద్రకళ డైరీలో సెక్స్ రాకెట్ వివరాలు

చంద్రకళ పర్సనల్ డైరీలో హీరోయిన్లతో వ్యభిచారానికి సంబంధించిన వివరాలు – కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బుల వివరాలు ఉన్నట్లు అధికారులు చార్జీషిట్లో పేర్కొన్నారు. ఇందులో ‘బీ’( పేరు చెప్పకుండా కోడింగ్ తో రాసి ఉంది) అనే హీరోయిన్ 2017 డిసెంబర్ 29 నుంచి జనవరి 7 వరకూ వ్యభిచారంలో పాల్గొన్నట్టు ఉంది. డైరీలో ఎవరెవరు.? ఎప్పుడు వచ్చారనే విషయాలు…. ఏఏ హోటల్ రూములలో ఉంచాం.. ఎవరి వద్ద ఎంత వసూలు చేశామన్నది వివరించారు.

*ఒకసారి వెయ్యి – రెండు సార్లు అయితే మూడు వేల డాలర్లు..

ఇక ‘డి’ అనే బాధిత నటి గురించి చంద్రకళ రాసింది. ఒకసారి 1000 డాలర్లు అని రెండు సార్లు 3వేల డాలర్లు అని చాలా చోట్ల రాసి ఉంది. ఇదంతా సెక్స్ రాకెట్ పేమెంట్ విషయం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత హీరోయిన్లకు చెల్లించిన డబ్బుల వివరాలు రాసి కింద చంద్ర సంతకం చేసింది.

*కిషన్-చంద్రకళ వాట్సాప్ చాట్ లే ఆధారాలు..

ఇక చికాగోలో సదురు హీరోయిన్లు దిగగానే కస్టమర్లకు చంద్రకళ హీరోయిన్ల ఫొటోలు సందేశాలు పంపేవారని రిపోర్టులో పేర్కొన్నారు. వారు ఏ తేదీల్లో ఏ హోటల్ లో అందుబాటులో ఉంటారనే విషయాలను అందులో పేర్కొనేవారు. కస్టమర్లతో బేరసారాలు ఆడి రేట్ ఫిక్స్ చేసారని పేర్కొన్నారు.

కిషన్ మోదుగుమూడిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి ఫోన్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. విటుల వివరాలు సేకరించి ప్రశ్నిస్తున్నారు. దీంతో త్వరలోనే మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు రానున్నాయి.