సన్నీ సోకులకు 15 మంది పోలీసుల కాపలా

0సన్నీ లియోన్ బయటకు రావాలంటే ఫుల్ సెక్యూరిటీ ఉండాల్సిందే. లేదంటే అభిమానులో – విమర్శకులో ఆమెను చుట్టుముట్టి కదలనివ్వకుండా చేయడం ఖాయం. ఇప్పుడు సన్నీలియోన్ కే కాదు ఆమె హోర్డింగులకు కూడా భారీ సెక్యూరిటీ అవసరం అవుతోందట. తాజాగా గుజరాత్ లోని సూరత్ లో సన్నీలియోన్ నటించిన ఓ యాడ్ వివాదాస్పదం కావడంతో అందుకు సంబంధించిన హోర్డింగ్ వద్ద పోలీసులతో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

సెక్సీ భామ సన్నీలియోన్ ఓ కండోమ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ కు సంబంధించిన పోస్టర్ ను పెద్ద హోర్డింగ్ గా గుజరాత్ లోని సూరత్ లో ఏర్పాటు చేశారు. దసరా సందర్భంగా చేసే గర్భా నృత్యాలతో ముడిపెడుతూ ఈ కండోమ్ యాడ్ ను రూపొందించారు. దీంతో ఇది వివాదాస్పదమైంది. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. సన్నీలియోన్ ఉన్న ఈ ప్రకటన ప్రజల మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని ఆరోపించారు. దీనిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

దీంతో గుజరాత్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను ఏర్పాటు చేశారు. 15 మంది పోలీసులను ఆ కండోమ్ యాడ్ హోర్డింగ్ వద్ద కాపలా పెట్టారు. అయితే… ఆ పోలీసులపై స్థానిక యువత సెటైర్లు వేస్తున్నారు. సన్నీ సోకుల వద్ద డ్యూటీ చేయడమంత అదృష్టం ఇంకేముంటుందంటూ ఆట పట్టిస్తున్నారట.Police-Security-for-Sunny-Leone