తనూశ్రీకి దర్శకురాలి సలహా – నేను కూడా..!

0

బాలీవుడ్ లో గత రెండు మూడు వారాలుగా తనూశ్రీ దత్తా వ్యవహారం హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. పది సంవత్సరాల క్రితం నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడు అంటూ తనూశ్రీ దత్తా సంచలన విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఇలాంటి నేపథ్యంలో తనూశ్రీకి బాలీవుడ్ రెండుగా చీలిపోయి కొందరు మద్దతు పలుకుతుండగా మరి కొందరు నానా పటేకర్ కు మద్దతుగా నిుస్తున్నారు.

బాలీవుడ్ లో పలువురు హీరోయిన్స్ తనూశ్రీ దత్తాకు మద్దతుగా నిలువగా కొందరు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. తాజాగా హిందీ దర్శకురాలు పూజా భట్ ఈ విషయమై స్పందించింది. తనూశ్రీ దత్తాకు వ్యతిరేకంగా పూజా మాట్లాడటం చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి విషయాల గురించి ఇన్నాళ్లకు మరీ ఇంత రచ్చ అవసరం లేదని ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఏం చేశావు అంటూ ఇతరులు ప్రశ్నించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఆ విషయాన్ని గురించి పెద్దగా పట్టించుకోకుంటా ఉంటే బెటర్ అంటూ సలహా ఇచ్చింది.

తాను గతంలో ఒక తాగుబోతు వ్యక్తితో వ్యవహారం నడిపించాను ఆ వ్యక్తి నన్ను కొట్టాడు కూడా. ఆ విషయాన్ని నేను బయటకు చెబితే నన్నే విమర్శించారు. ఇప్పుడు తనూశ్రీ దత్తా వ్యవహారంలో కూడా అదే ఎదురయ్యే అవకాశం ఉందని అందుకే ఆమె సైలెంట్ గా ఉండటం ఉత్తమం అంటూ పూజా సలహా ఇచ్చింది. అయితే పూజా వ్యాఖ్యలపై కొందరు తనూశ్రీ మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసటగా నిలవకున్నా పర్వాలేదు కాని అన్యాయం జరిగినా కూడా గొంతు విప్పొద్దు అంటూ చెప్పడం ఏంటీ అంటూ పూజాపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer