డీజే భామ కు మరో ఘనత దక్కింది..

0డీజే మూవీ తో ఒక్కసారిగా యూత్ లో వేడి సెగలు పుట్టించిన పూజ హగ్దే..ఆ తర్వాత వరుస ఛాన్సులతో బిజీ హీరోయిన్ అవుతుంది. ప్రస్తుతం బెల్లం కొండ శ్రీనివాస్ కు జోడిగా సాక్ష్యం మూవీ లో నటిస్తుంది. అలాగే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ లో , అలాగే మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ తో పాటు ప్రభాస్ – జిల్ ఫేమ్ రాధాకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో సైతం పూజ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. ఇలా ఒకేసారి ముగ్గురి అగ్ర హీరోల సరసన జోడి కట్టే ఛాన్స్ దక్కడం తో పూజానే నెంబర్ వన్ హీరోయిన్ ఆయె ఛాన్స్ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటె తాజాగా 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ లో పూజ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఈ వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పూజ తర్వాతి స్థానాలలో కాజల్ , రకుల్ ప్రీత్ సింగ్, పీవి సింధు, ఆదాశర్మలు ఉన్నారు. టాప్ 5లో నలుగురు సినిమా స్టార్స్ ఉండగా, ఒక్కరు మాత్రమే క్రీడా రంగానికి సంబంధించిన వారు ఉండడం విశేషం.

ఇక ఆరవ స్థానంలో తమన్నా, ఏడో స్థానంలో సిమ్రాన్ చౌదరి, ఎనిమిదో స్థానంలో సృష్టి వ్యాకరణం, తొమ్మిదో స్థానంలో అనుష్క పదో స్థానంలో మిథాలీ రాజ్ ఉన్నారు.