ఎన్టీఆర్ , బన్నీ ల ఫై జిగేల్ రాణి కామెంట్స్..

0జిగేల్ రాణి అనగానే ఇప్పుడు ఎవరైనా పూజా హగ్దే పేరే చెపుతున్నారు..డీజే చిత్రం తో పాపులర్ అయినా ఈ బ్యూటీ తాజాగా రంగస్థలం తో మరింత పేరు తెచ్చుకుంది. రామ్ చరణ్ తో పోటీ పడి జిగేల్ రాణి సాంగ్ లో అదరగొట్టింది. ప్రస్తుతం వరుస ఛాన్సులతో బిజీ అయిపొయింది.

తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంగ్ హీరోలైన అల్లు అర్జున్ , ప్రభాస్ ,ఎన్టీఆర్ , మహేష్ బాబు ల గురించి చెప్పుకొచ్చింది.

” అల్లు అర్జున్‌తో చేస్తున్నప్పుడు సరదాగా ఉంటుంది. ఆయన చాలా మంచి డాన్సర్‌. ప్రాక్టీస్‌కి కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్నా ఏమనేవారు కాదు. అంత మంచి వ్యక్తి ఆయన. ఇక మహేష్‌ బాబుగారి పక్కన ఎంత అందమైన హీరోయిన్‌ అయినా తేలిపోతుంది. అంత స్మా‌ర్ట్‌గా ఉంటారు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్‌ గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోయింది. ప్రభాస్‌ని ఇంతవరకూ వ్యక్తిగతంగా కలవలేదు. కానీ, ఆయన గురించి చాలావిన్నాను. త్వరలోనే ఆయనతో సినిమా చేయబోతున్నాను.

ఇక్కడికి వచ్చాక ఎన్టీఆర్ గురించి చాలావిన్నాను. ఎంత కష్టతరమైన సీన్‌ అయినా, డాన్స్‌ అయినా ఒక్కషాట్‌లో చేస్తారని చెప్పారు. అందుకే ఆయనతో డాన్స్‌అన్నా, సీన్‌అన్నా భయమేస్తోంది. నా వరకూ నేను బాగా ప్రాక్టీసు చేస్తున్నాను. ఆయనతో పోటీపడి చేస్తానని చెప్పను కానీ, సెట్‌లో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలన్నదే నా ఉద్దేశం” అంటూ పూజా చెప్పుకొచ్చింది.