పూజ విషయంలో బన్నీ కరక్టే!!

0Pooja-hegde-Correct-Option-‘డిజె దువ్వాడ జగన్నాథమ్’ సినిమా రిలీజైంది. సాధారణంగా ఒక సినిమా చుట్టూ ఉన్న నెగెటివ్ ఇంపాక్ట్ అంతా.. ఇంకా నెగెటివ్ గా అవ్వాలన్నా.. లేదంటే పాజిటివ్ గా మారాలన్నా కూడా.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. రిలీజయ్యాక అంచనాలన్నీ తారుమారు అయిపోతాయ్. ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకున్న కొన్ని డెసిషన్లు ముందు నెగెటివ్ అనిపించినా కూడా.. ఇప్పుడు మాత్రం సీన్ మారింది.

దాదాపు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చేసి.. అసలు పూజా హెగ్డే ను దించింది కేవలం బికినీ సీన్ కోసమేనా అంటూ ఫిలిం నగర్లో వినిపించిన గుసగుసల గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఈమెకు నటన పెద్దగా రాదనే సంగతి ఇంతకుముందు ఆమె చేసిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. పూజా అందాల వర్ణన మాత్రం అద్దిరిపోయింది. హరీశ్ శంకర్ ఆమె గ్లామర్ ను ఒక రేంజులో ఆరబోయించాడు. ముఖ్యంగా ఆమె బికినీ సీన్ మరియు రెండు పాటల్లో గ్లామర్ ఆరబోత అదిరిపోయింది. అలాగే పుచుక్ పుచుక్ అని బన్నీకి ముద్దులు పెట్టే సీన్లలో కూడా అమ్మడు తెగ ఊరించేసింది. సో పూజా హెగ్డే ను పెట్టుకుందాం అనే విషయంలో బన్నీ రైటే చేశాడు అనుకోవాలి.

ఇకపోతే ఒక కొత్త పిల్లకు ఇలా కోటి రూపాయలు పైకం ఇవ్వడం టాలీవుడ్ కు ఇవాళ నేర్చుకున్న పాఠం కాదులే. గతంలో కూడా మల్లీశ్వరి సినిమాకు కత్రినా కైఫ్ కు ఇలాగే అందించారు. అయితే ఈ భామలు ఇక్కడ ఎంతగా సక్సెస్ అవుతారనేది మాత్రం చూడాల్సిన విషయం.