ఇక్కడ బికినీ.. అక్కడ కాలేజ్ లో ఎంట్రీ

0pooja-hegde-hotదువ్వాడ జగన్నాధంతో రొమాన్స్ చేసి.. టాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించేందుకు వస్తున్న భామ పూజా హెగ్డే. ఇప్పటికే రెండు సార్లు టాలీవుడ్ సినిమాల్లో కనిపించినా క్రేజ్ రాలేదు. చివరకు డైరెక్టర్ అశుతోష్ గోవార్కర్ .. స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా అమ్మడి ఫేట్ మార్చలేకపోయారు.

కానీ డీజేగా వస్తున్న అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ అనగానే.. అమ్మడికి లెక్కలేనన్ని ఆఫర్స్ పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. ఈ మూవీలో పూజా హెగ్డే హాట్ హాట్ గా కనిపించిందనే సంగతి ట్రైలర్స్ చూస్తే తెలుస్తోంది. కానీ ఓ సన్నివేశంలో అయితే మరీ వేడెక్కించేస్తుందట పూజ. డీప్ ‘V’ కట్ ఉండే ఓ సింగిల్ పీస్ బికినీ వేసుకుని మరీ యాక్టింగ్ చేసేసిందట పూజా హెగ్డే. సినిమాలో ఈ సీన్ కేకలు పెట్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇక్కడ బికినీ సీన్ చేసిన ఈ భామ.. ముంబైలో ఓ కాలేజ్ లో చేరడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పూజా హెగ్డేకు చదువు అంటే తెగ ఇష్టం.

అయితే.. ఇది మానవ పరిణామ శాస్త్రం(ఆంథ్రోపాలజీ) అంటే విపరీతమైన మక్కువ. అందుకే ముంబైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ లో చేరిన ఈ భామ.. అంథ్రోపాలజీలో పీజీ కోర్సులో జాయిన్ అయింది. గతంలో అందాల పోటీల్లో పాల్గొని.. ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ.. 26 ఏళ్ల వయసులో ఇంకా చదువుపై మక్కువ చూపుతోందంటే.. కచ్చితంగా పూజా హెగ్డే డిఫరెంట్ పర్సనాలిటీ అనాల్సిందే.