మెరూన్ డ్రెస్ లో మాయచేస్తున్న పూజ

0

పూజా హెగ్డే తన కెరీర్లో మొదటి నుంచి లక్కీనే. ఎందుకంటే తెలుగులో పూజా చేసిన సినిమాలు ఏవీ పెద్దగా విజయాలు సాధించలేదు. అయినా ‘మొహెంజో దారో’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పూజా కెరీర్ మళ్ళీ కన్ఫ్యూజన్లో పడిపోయింది. అలాంటి సమయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ‘డీజే’ వచ్చి అమ్మడి కెరీర్ కు ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చింది.

ఇక వెనక్కు తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. మహేష్ బాబు ‘మహర్షి’ తో పాటుగా ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ ప్రాజెక్టు లో కూడా పూజా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలు మాత్రమే కాదు బాలీవుడ్లో ‘హౌస్ ఫుల్ 4’ లో కూడా నటిస్తోంది. ఈ సినిమాలలో నటించడంతో సరిపెట్టుకుంటుందని మనం అనుకుంటే అంతకంటే పొరపాటు మరోటి ఉండదు. మధ్యమధ్యలో మ్యాగజైన్ కవర్ పేజీల కోసం.. ఫిల్మీ ఈవెంట్ల కోసం హాటుగా తయారై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకవేళ అలాంటి స్పెషల్ ఈవెంట్స్ ఏవీ లేకపోతే తనంతట తానే ఒక సందర్భం సృష్టించి అందాలను ఆరబోస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం జీ సినీ అవార్డ్స్ ఫంక్షన్ కోసం అలా అందంగా తయారయింది.

మెరూన్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో తళుక్కుమని మెరిసిన పూజ లూజ్ హెయిర్ తో.. ఒక షార్ట్ నెక్లెస్ మాత్రమే ధరించి ఫోటోకు పోజిచ్చింది. మ్యాచింగ్ లిప్ స్టిక్ తో ఒక సెన్సువల్ పోజిచ్చింది. అందాల బొమ్మలా ఉందంటే నమ్మండి. అందుకేగా ఆరడుగుల అందగాడైన మహర్షి ఈ భామ బుట్టలో పడిపోయింది!
Please Read Disclaimer