పూజకు వేళాయెనే!

0

తనదైన అందం అభినయంతో కుర్రకారు గుండెల్లో తిష్ఠ వేసింది ముంబై బొమ్మ పూజా హెగ్డే. నటించిన అరడజను సినిమాలతోనే అసాధారణ స్టార్ డమ్ అందుకున్న మేటి కథానాయికగా పాపులరైంది. కోటి నుంచి 2కోట్ల పారితోషికం అందుకునే అమ్మడిగా పూజా టాలీవుడ్ లో ఎదిగింది. ఓవైపు తెలుగు సినీపరిశ్రమతో పాటు – బాలీవుడ్ లోనూ తనదైన చొరవతో దూసుకుపోతోంది.

`అరవింద సమేత` చిత్రంలో టైటిల్ పాత్రలో నటించి మెప్పించిన పూజా.. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. మహేష్ సరసన మహర్షి ప్రభాస్ సరసన జాన్ చిత్రాల్లో నటిస్తోంది. మహర్షి ఈ సమ్మర్ ట్రీట్ కి రెడీ అవుతుంటే – జాన్ మాత్రం ఏడాది చివరిలో లేదా 2020లో రిలీజయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. బన్ని- డీజే – ఎన్టీఆర్ – అరవింద సమేత తర్వాత పూజా గ్రాఫ్ అమాంతం పెరిగిందనడానికి తాజా అవకాశాలే ఎగ్జాంపుల్.

వీటితో పాటు బాలీవుడ్ లో క్రేజీగా `హౌస్ ఫుల్ 4` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలో దగ్గుబాటి రానా విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2019-20 సీజన్ పూజాకి బాగా కలిసొచ్చే సీజన్ అని ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు చెబుతున్నాయి. ఇటు టాలీవుడ్ – అటు బాలీవుడ్ రెండు చోట్లా ఈ బ్యూటీ మరింతగా బిజీ అయిపోవడం ఖాయం అని అర్థమవుతోంది. సామాజిక మాధ్యమాల్లోనూ పూజా ఎంతో యాక్టివ్. రెగ్యులర్ గా ఆన్ లొకేషన్ వ్యవహారాల్ని – లేటెస్ట్ ఫోటోషూట్లను అభిమానులకు షేర్ చేస్తూ వేడి పెంచుతూనే ఉంది. వీటి నుంచి లేటెస్ట్ ఫోటో ఇది. డిజైనర్ స్వెటర్ లో పూజా అల్ట్రా మోడ్రన్ లుక్ మైమరిపిస్తోంది. ఆ చేతికి ఫిట్ నెస్ బ్యాండ్ వాచ్ మరో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది.
Please Read Disclaimer