బన్నీతో రొమాన్స్ చేస్తున్న బ్యూటీ

0pooja-hegdeముంబై భామ పూజా హెగ్డే.. ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ముకుందలో కూడా ఆకట్టుకుంది. ఇక వరుస ఛాన్సులు అందుకోవడమే తరువాయి అనుకుంటున్న టైంలో.. ముంబై నుంచి పిలుపు రావడం.. హృతిక్ మూవీ మొహెంజొదారో చేయడం.. అది పేలిపోవడం వరుసగా జరిగిపోయాయి. అయితే.. మొహెంజొదారో రిలీజ్ కి ముందే.. స్టైలిష్ స్టార్ తో ఓ మూవీకి సైన్ చేయడం.. ఈ భామ అదృష్టం అనే చెప్పాలి.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న డీజే-దువ్వాడ జగన్నాధంలో నటిస్తున్న పూజా హెగ్డే.. బన్నీతో స్క్రీన్ పంచుకోవడంపై తెగ థ్రిల్లింగ్ గా ఫీలయిపోతోంది. ‘నేను అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ ని. అలాంటిది మళ్లీ టాలీవుడ్ కి రావడం.. ఆయనతోనే వర్క్ చేసే అవకాశం దక్కడం నాకు తెగ కిక్ ఇచ్చేస్తోంది. తను చాలా స్వీట్ పర్సన్. అల్లు అర్జున్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి’ అంటున్న పూజా హెగ్డే.. ఈమూవీలో తన పాత్ర గురించి కొన్ని సంగతులు రివీల్ చేసింది.

‘గతంలో నేను సాంప్రదాయంగా ఉండే అమ్మాయి పాత్రలు చేశాను. కానీ డీజేలో నేను అల్ట్రా మోడర్న్ గాళ్ గా కనిపిస్తాను. తెలుగులో ఇది నాకు మూడో సినిమా అయినా సరే.. ఇప్పుడు తెలుగు అర్ధమైపోతోంది. ముంబై వెళ్లే ముందు ఒక్క ముక్క తెలుగు రాదు. కానీ ఇప్పుడు మాత్రం అర్ధం చేసుకోగలుగుతున్నాను. అందుకే డీజేలో నటించడం మరింత తేలికైంది’ అని చెబుతున్న పూజా హెగ్డే.. మొహెంజొదారో ఫ్లాప్ అయినా.. ఎంతో ఎక్స్ పీరియన్స్ సంపాదించానని అంటోంది.