మహేష్25పై ఆ బ్యూటీ ఏమందంటే..

0pooja-hegde-hotమహేష్ బాబు ప్రస్తుతం స్పైడర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా.. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసేశాడు సూపర్ స్టార్. స్పైడర్ మహేష్ కు 23వ సినిమా కాగా.. కొరటాలతో చేస్తున్న సినిమా 24వది.

మహేష్25ను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించనుండగా.. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. జనవరి చివర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉండగా.. మహేష్25లో హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేశారనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాధం ప్రమోషన్స్ లో ఉన్న పూజా హెగ్డే మహేష్ తో మూవీ చేయడంపై రియాక్ట్ అయింది. మహేష్25లో నటిస్తున్న విషయాన్ని కన్ఫాం చేయలేదు కానీ.. ఇప్పుడే ఈ ప్రాజెక్టుపై తాను ఎలాంటి కామెంట్ చేయలేనంటూ తప్పించుకుంది.

ఈమె చెప్పిన ఆన్సర్ లోనే అవుననే జవాబు వెతికేసుకుంటున్నారు చాలామంది. మూవీ ప్రారంభానికి ఇంకా 6 నెలలకు పైగా సమయం ఉండడం.. షెడ్యూల్స్ ఖరారు కాకపోవడం.. మహేష్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోవడంతోనే.. ప్రస్తుతానికి పూజా హెగ్డే ఇలా తప్పించుకునే ఆన్సర్ చెప్పిందని టాక్.