ఫ్లాప్ హీరొయిన్ రేటు అక్షరాల కోటి

0Pooja-Hegdeచేసిన సినిమాలు మూడంటే మూడు. ముకుంద, ఒక లైలా కోసం వాటి తర్వాత ఇంకా విడుదల కావలసిన డిజే దువ్వాడ జగన్నాధం. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఏ హీరొయిన్ అయినా అవకాశాల కోసం కింద మీదా పడుతూ ఉండాలి. కాని పూజ హెగ్డే మాత్రం తాను ఇందుకు మినహాయింపు అంటోంది. ఔను మరి. హీరొయిన్ల రెమ్యునరేషన్లు వాళ్ళు సాదించిన ట్రాక్ రికార్డును బట్టి నిర్ణయించే ఇండస్ట్రీలో పూజా మాత్రం కొత్త ట్రెండ్ కు నాంది పలుకుతోంది. డిజే లో హరీష్ శంకర్ పూజలోని పూర్తి అందాన్ని బయటకు తోడేసాడు. అది పోస్టర్స్ లో ట్రైలర్ లో చాలా క్లియర్ గా కనిపించింది.

ఇంతకు ముందు తనతో సినిమాలు చేసిన దర్శకులు ఎవరు తనను ఇంత గ్లామరస్ గా చూపలేదు అన్నది వాస్తవం. అందుకే మెల్లగా బడా నిర్మాతల కన్ను పూజా హెగ్డే పైన పడుతోంది. హిందిలో చేసిన హ్రితిక్ రోషన్ మొహెంజో దారో అట్టర్ ఫ్లాప్ కావడంతో పూజాను అక్కడ వారు ఎవరు పలకరించడం లేదు. దీంతో తెలుగులో జెండా పాతాలని గట్టిగ ఫిక్స్ అయ్యింది.

తన కొడుకుని స్టార్ హీరోగా చేసే వరకు నిద్రపోనని శపథం చేసి మరీ సినిమాలు తీస్తున్న బెల్లంకొండ సురేష్ ఇప్పుడు బోయపాటి శీను సినిమా ఫినిషింగ్ లో ఉండగానే మరో సినిమా కూడా స్టార్ట్ చేసాడు. బాలకృష్ణ తో డిక్టేటర్ తీసిన శ్రీవాస్ దర్శకత్వంలో ఇటీవలే కొత్త సినిమా మొదలు పెట్టాడు. అందులో హీరొయిన్ కోసం పూజా హెగ్డే ని సంప్రదిస్తే అక్షరాలా కోటీ ప్లస్ టాక్స్ డిమాండ్ చేసిందట. కొడుకు విషయంలో నో కాంప్రోమైజ్ అంటున్న బెల్లంకొండ సురేష్ పూజా రేట్ కి సై అన్నాడని టాక్.

అసలు ఎవరికి ఆసక్తి లేని తన కొడుకు మొదటి సినిమా అల్లుడు శీనుకే సమంతాను పట్టుకొచ్చిన సురేష్ కి పూజాను ఒప్పించడం పెద్ద లెక్క కాదనుకోండి. ఇంకా భారీ హిట్ ఒక్కటి కూడా అందుకొని పూజకి ఇంత ఆఫర్ అంటే చాలా చాలా ఎక్కువ అని చెప్పాలి. గబ్బర్ సింగ్ తో శృతి హసన్ కి బ్రేక్ ఇచ్చినట్టే తనకు కూడా డిజే తో హరీష్ శంకర్ లైఫ్ టర్న్ చేస్తాడని బలంగా నమ్ముతోంది పూజా. మరి కోటి రేంజ్ కు చేరుకున్న పూజ కి డిజే ఆ ప్లేస్ ఫిక్స్ చేస్తాడో లేదో తెలియాలంటే 23 దాకా ఆగాలి.