ఎన్టీఆర్ ఫీలింగ్స్ ను అర్ధం చేసుకోగలను

0

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా హీరోయిన్ పూజా హెగ్డే మినహా చిత్ర యూనిట్ సభ్యులు దాదాపు అంతా కూడా హాజరు అయ్యారు. హీరోయిన్ పూజా హెగ్డే ముందే ఖరారు అయిన షూటింగ్ షెడ్యూల్ కారణంగా జెరూసలెంలో ఉండి పోయింది. షూటింగ్ నిమిత్తం అక్కడ ఉన్నా కూడా ఆమె మనసు అంతా కూడా ఇక్కడే ఉందట.

షూటింగ్ కోసం జెరుసలేంలో ఉన్న తాను అరవింద సమేత చిత్రం ప్రీ రిలీజ్ వేడుక లైవ్ చూశాను. ఎన్టీఆర్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ఆయన గుండెల్లోంచి వచ్చినట్లుగా అనిపించింది. ఎన్టీఆర్ మాట్లాడిన కొన్ని మాటలు నాకు అర్థం కాకపోవచ్చు. కాని ఆయన ఫీలింగ్స్ ను మాత్రం తాను అర్థం చేసుకోగలను అంటూ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. ఆయన ఫీలింగ్స్ ను నేను కూడా అనుభవించాను అంది. వేడుకలో పాల్గొనలేక పోవడంతో చాలా బాధపడుతున్నాను. మీ అందరికి నచ్చే విధంగా అరవింద సమేత ఉంటుందని పేర్కొంది.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబో గత మూడు నాలుగు సంవత్సరాలుగా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రంతో ఇద్దరు కూడా కలిసి రాబోతున్నారు. దసరాకు రాబోతున్న ఈ చిత్రం నందమూరి అభిమానులకు పండుగను తీసుకు వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నాగబాబు – జగపతిబాబు కీలకంగా కనిపించబోతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
Please Read Disclaimer