రాఘవకు సారీ చెప్పిన పూజా!!

0

మొన్న జరిగిన అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ లో అందరు వచ్చారు కానీ అసలు హీరోయిన్ పూజా హెగ్డే లేని లోటు మాత్రం అభిమానులు ఫీలయ్యారు. దానికి కారణం ఉంది. టైటిల్ లో సగం తన పాత్ర పేరు మీదే ఉంది. అరవింద అంటే పూజా హెగ్డేనే. తన సమేతంగా వీర రాఘవరెడ్డి పేరుతో ఎన్టీఆర్ ది తర్వాత ఉంది. అంటే కథలో ఎంత ప్రాధాన్యం ఉంటే తప్ప త్రివిక్రమ్ అలా పెట్టడు కదా. ఒక వేళ అలా కాదు అనుకుంటే జస్ట్ వీర రాఘవ అని పెట్టినా సరిపోయేది. సో కథకు బలమైన లింక్ ఉండబట్టే అరవింద అంతగా హై లైట్ అవుతోంది.

కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పూజా ప్రమోషన్ కోసం ఏ మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోవడం. ప్రస్తుతం జై సల్మేర్ లో హౌస్ ఫుల్ 4 హిందీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పూజా ఆ తర్వాత ప్రభాస్ @20 కి అటుపై మహేష్ బాబు మహర్షి కోసం పూర్తిగా విమానాల్లోనే తిరగాల్సి ఉంటుంది. మధ్యలో ఇండియాకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వినికిడి. ఇంత టైట్ షెడ్యూల్ లో పూజాను ప్రమోషన్ లో పాల్గొనాలని ఆశించడం కూడా తప్పే. అందుకే వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ కు ప్రమోషన్ కోసం తాను రాలేని నిస్సహాయతను వ్యక్తం చేసినట్టు ;తెలిసింది. వాళ్ళైనా చేయగలిగింది ఏమి లేదు కాబట్టి సరే అని చెప్పినట్టు టాక్. పూజా హెగ్డే ఈ రేంజ్ లో బిజీగా ఉంటే ఎవరైనా నిర్మాతలు తనను కలవాలనుకున్నా వెంటనే దొరికేలా లేదు.

ఇప్పటి దాకా కెరీర్ లో సాలిడ్ బ్లాక్ బస్టర్ అంటూ ఒక్కటీ లేని పూజా హెగ్డే అది అరవింద సమేత వీర రాఘవతోనే మొదలవుతుందని గట్టి నమ్మకంతో ఉంది. దీని కోసం స్వంతంగా డబ్బింగ్ చెప్పడానికి కూడా వెనుకాడని పూజకు ఈ ఏడాదిలో ఇది రెండో సినిమా. సాక్ష్యం నిరాశపరిచినా తారక్ సహాయంతో గట్టి హిట్ కొడతాను అని చెబుతోంది. ఈ సస్పెన్స్ ఇంకొక్క వారమే.
Please Read Disclaimer