నామాలు పెట్టుకున్న బన్నీ నచ్చాడు

0Pooja-Hegde-Speech-at-DJహరీష్ శంకర్ డైరక్షన్లో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’ విడుదలై ఇప్పుడు బాక్స్ ఆఫీసు వద్ద గేర్ మార్చి వేగాన్ని పెంచింది. ఇప్పటికకే విడుదలైన 4 రోజులలోనే 75 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసిందట. ఈ సినిమా పొందిన విజయాన్ని అభిమానులుతో పంచుకోవడం కోసం ఒక థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే కూడా తన మాటలతో అందరినీ ఆనందపరిచింది.

నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత గ్లామారస్ హీరోయిన్ గా కనిపించలేదు ఈ సినిమాలో ఇలా అందంగా కనిపించడానికి కారణం డైరెక్టర్ హరీష్ అని చెబుతూ సినిమాటోగ్రాఫర్ బోస్ కు తన ధన్యవాదాలు తెలుపుకుంది. “దిల్ రాజు 25వ సినిమా విజయవంతం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సినిమాలో ముఖ్యంగా రాజుగారి ప్రొడక్షన్లో నటించడం నాకు దక్కిన అధృష్టంగా భావిస్తున్నాను. మీరు మరిన్ని ఇలాంటి సినిమాలు తీసి కలకాలం ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. నేను ఇంత అందంగా కనిపించేలా నా పాత్రను తయారుచేసిన మా డైరెక్టర్ హరీష్ శంకర్ కు నా థాంక్స్” అని చెప్పింది. చివరగా హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. ”బ్రాహ్మిణ్ స్టైల్ లో పంచె కట్టి.. నుదిటిన విభూదితో నామాలు పెట్టుకుని చాలా అందంగా ఉన్నావు బన్నీ. తను కాకుండా దువ్వాడ జగన్నాధం పాత్రను మరిఎవ్వరు చేయలేరు” అని చెబుతూ.. ”ఇప్పటి నుండి నీ అభిమానులలో నేను ఒకదాన్ని” అని ముగించింది.

ఒక లైలా కోసం – ముకుంద సినిమాలు పెద్ద హిట్ కాకపోవడం వలన స్టార్ గా పెద్ద గుర్తింపు కూడా రాలేదు అమ్మడికి. ఇప్పుడు దువ్వాడ జగన్నాధం సినిమా దెబ్బతో తెలుగులో మరిన్ని మంచి సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ పూజా హెగ్డే మహేష్ వంశీ పైడిపల్లి సినిమాలో చేయనుందని టాక్.