ఎన్టీఆర్ కు అది ఎలా సాధ్యమో : పూజా హెగ్డే

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించే ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఆయన డాన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆయనతో డాన్స్ చేయాలంటే చెమటలు పట్టాల్సిందే అని ఆయనతో షూట్ ఉందంటే ముందు రోజు హోం వర్క్ తప్పదని గతంలో పలువురు హీరోయిన్స్ – ఎన్టీఆర్ గురించి పలు రకాలుగా మాట్లాడారు. కాని తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం ఎన్టీఆర్ గురించి మరో స్టెప్ ముందుకు వేసి ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్బుతమైన నటుడు అంటూ గతంలో పలు సార్లు ఆయన సినిమాల ద్వారా రివీల్ అయ్యింది. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే చెబుతుంటే మరింత ఆసక్తికరంగా ఫ్యాన్స్ వింటున్నారు. ‘అరవింద సమేత’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనలేక పోయింది. అందుకే తాజాగా ఆమె ఒక వీడియో బైట్ ను విడుదల చేసింది. ఆ వీడియో బైట్ లో చిత్ర యూనిట్ సభ్యులందరిని వరుస పెట్టి ప్రశంసలు కురిపించింది.

ఎన్టీఆర్ గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఆయన ఎంతటి సీన్ ను అయినా ఒకటి రెండు టేక్ ల కంటే ఎక్కువగా తీసుకోడు. డాన్స్ ల్లో ఆయన్ను అందుకోవడం కష్టమే. నటనలో కూడా తనకు తానే సాటి. ఎంత పెద్ద సీన్ అయినా సునాయాసంగా కంప్లీట్ చేయడంలో ఆయనకే సాధ్యం. అది ఎలా సాధ్యం అవుతుందో నాకు ఎంతకు అర్థం కాలేదు. చాలా సింపుల్ గా షాట్స్ ను కంప్లీట్ చేస్తాడు అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించింది. ఎన్టీఆర్ తో ఈమె నటించిన అరవింద సమేత చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
Please Read Disclaimer