ఇన్నాళ్లు తెలియదు ఆమెను ఇకపై వాడేస్తా : దేవిశ్రీ

0

నిన్న మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరిగింది. ఈ చిత్రంకు సంగీతంను దేవిశ్రీ ప్రసాద్ అందించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు సంగీతంలో ప్రావిణ్యం ఉంది గిటార్ వాయించడం పాటలు పాడటం నాకు తెలుసు. కాని ఇప్పటి వరకు దేవితో చాలా సినిమాలు చేసినా కూడా ఆయన నా ట్యాలెంట్ ను తెలుసుకోలేక పోయాడు. భవిష్యత్తులో అయినా నా ప్రతిభను ఆయన ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

పూజా హెగ్డే వ్యాఖ్యలపై స్పందించిన దేవిశ్రీ ప్రసాద్ ఇన్ని సినిమాలు ఆమెతో చేశాను ఇన్నాళ్లు ఆమె గురించి తెలుసుకోలేక పోయాను. పూజాలో అంత ట్యాలెంట్ ఉందని నేను అనుకోలేదు. ఇప్పుడు తెలిసింది కనుక ఖచ్చితంగా తన భవిష్యత్తు సినిమాల్లో ఆమెతో కనీసం ఒక్క పాట అయినా పాడిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో దేవిశ్రీ ప్రసాద్ పలువురు స్టార్స్ తో పాడించాడు. మామూలుగా సింగర్స్ పాడితే పెద్దగా ప్రాముఖ్యత ఉండదు అదే ఒక హీరో కాని హీరోయిన్ కాని పాట పాడితే ఆ సినిమాకు పబ్లిసిటీతో పాటు ఆ పాటకు మంచి క్రేజ్ దక్కుతుంది. అందుకే దేవిశ్రీతో పాటు పలువురు సంగీత దర్శకులు కూడా స్టార్స్ తో పాడించేందుకు ఆసక్తి చూపిస్తారు. పూజాతో కూడా దేవిశ్రీ పాడించడం ఖాయంగా కనిపిస్తోంది. అది ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుంది.
Please Read Disclaimer