అఖిల్ కి కూడా పూజానే కావాలి

0పూజా హెగ్డే ఇప్పుడు అదిరిపోయే క్రేజ్ లో ఉంది. ‘ముకుందా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా.. డిజేతో కమర్షియల్ మెరుపులు మెరిపించింది. దీంతో ఇప్పుడు అందరి లుక్కూ పూజాపై పడింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో పూజాని ఫైనల్ చేశారు. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాలో పూజానే హీరోయిన్. జిల్ ఫేం రాధకృష్ణ, ప్రభాస్ తో యువీకి క్రియేషన్ లోనే ఓ సినిమా చేయబోతున్నాడు. ఈసినిమాలో కూడా పూజానే హీరోయిన్ .

ఇప్పుడు మరో ఆఫర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూవీ రూపొందనుందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోను పూజా హెగ్డే ఎంపిక చేశారని టాక్. ఐతే ఇది ఓ పాట కోసమని టాక్.