పూనం కౌర్.. కాస్త కంట్రోల్ చేస్కోమ్మా

0ఆకాశవాణి.. ట్విట్టర్ కేంద్రం.. మీరు చూస్తున్నది ‘చీకట్లో రాళ్ళు’ అనే ధారావాహికం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నటీనటులు.. శ్రీరెడ్డి అండ్ పూనం కౌర్ తదితరులు. ముందుగా.. శ్రీరెడ్డి వేసిన రాళ్ళన్నీ టార్గెట్ మిస్సయిన తరువాత.. ఇప్పుడు పూనం వేస్తున్న కొత్త రాళ్ళను చూద్దాం. ఈ విధంగా ఇంట్రొడక్షన్ ఇస్తే కాని.. అసలు వీళ్ళు చెప్పే స్టోరీలకు కాస్తన్న డెప్త్ ఉండదేమో. ఎందుకంటే వీళ్ళ స్టోరీలు అంత ఘోరంగా ఉన్నాయ్.

చాలా రోజుల నుండి.. ఒక డైరక్టర్ దుర్మార్గుడని.. అతను నైతిక విలువలు లేని వాడని.. ఎన్నారై అమ్మాయిలకు అయితే ఛాన్సులు ఇస్తాడని.. ఇప్పుడు తాను చేసిన తప్పులకు పశ్చాత్యాపం పడుతూ అజ్ఞాతవాసం చేస్తున్నాడని.. నానా హంగామా చేస్తోంది. అయితే ఈ మ్యాటర్ అంటే ఒక స్టార్ డైరక్టర్.. అలాగే అతను తాజాగా ఒక పవర్ ఫుల్ స్టార్ తో చేసిన సినిమాలో ఒక హీరోయినైన ఎన్నారై భామ గురించేనని అందరికీ అర్ధమవుతోంది. కాకపోతే మరీ ప్రత్యేకంగా పూనం ఇన్నేసిసార్లు కామెంట్లు చేయడంతో.. అందరూ ఆల్రెడీ ఈమెకు సదరు హీరోయిన్ చేసిన పాత్రను ఇస్తానని తరువాత తీసి పక్కనెట్టేసి ఉంటారని.. అందుకే రచ్చ చేస్తోందని అనుకుంటున్నారు.

ఇంతలో ఒక వెబ్ సైట్ వారు అసలు కనీసం పూనం పేరు కూడా రాయకుండా.. అసలు ఒక హీరోయిన్ ఇలా ఎందుకు చిర్రుబుర్రులాడుతోంది? అంటూ ఒక కథనం రాశారు. ఆ సినిమాలో చేసి ఒక పవర్ ఫుల్ హీరోకు దగ్గరవ్వాలని ఈ ఫ్లాప్ హీరోయిన్ ప్రయత్నించడంతో.. విషయం పసిగట్టిన డైరక్టర్ ఆమెను దూరం పెట్టాడని వారు చెప్పుకొచ్చారు. ఇక గుమ్మడికాయల దొంగెలవరు అంటే భుజాలు తడుముకున్నట్లు.. వెంటనే పూనం పాప తన పేరు రాయకపోయినా కూడా ఇది తనదే అంటూ రెస్పాండ్ అయిపోయింది. పైగా ఆ డైరక్టర్ స్వయంగా తన మీడియా హెడ్ క డబ్బులిచ్చి ఆర్టికల్ రాయించాడంటూ ఆరోపించింది.

అసలు పేర్లు రాయకుండా వచ్చిన కథనానికి పూనం స్పందించిందంటే.. అక్కడ వెబ్ సైట్ లో వచ్చిన కథనం నిజమేనని అనుకోవాలి. ఇప్పుడు ఫిలిం నగర్లో ఇదే టాక్. అసలు నిజంగానే అంత దమ్ముంటే.. అసలు పూనం డైరక్టుగా పేర్లు ఓపెన్ గా చెప్పొచ్చుగా. నిజంగా తనవైపు నిజం ఉంటే భయపడటం ఎందుకు? ఇలా చీకట్లో రాళ్ళు వేయడం ఎందుకు? పైగా ఏ చిన్న ఆర్టికల్ వచ్చిన ఉలిక్కిపడటం ఎందుకు? అనవసరంగా మీడియాపై నోరుజారే ముందు కాస్త కంట్రోల్ చేస్కో పూనం.. లేకపోతే శ్రీరెడ్డిలా మొత్తంగా సైడ్ అయిపోతావ్ అంటున్నారు ఆమె అభిమానులు.