అమెరికా సెక్స్ రాకెట్ : బాంబు పేల్చిన పూనమ్

0కాస్టింగ్ కౌచ్ గురించి మరిచిపోకముందే అమెరికాలో చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ దందా సాగిస్తున్న కిషన్ మోదుగుమూడి – అతడి సతీమణీ చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అమెరికా పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంచలన వాస్తవాలు వెలుగులోకి తీసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ చికాగో సెక్స్ రాకెట్ గురించి మరో బాంబు పేల్చింది.

ఇప్పటికీ చాలామంది హీరోయిన్లు యాంకర్స్ అమెరికా సెక్స్ రాకెట్ గురించి సంచలన విషయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా పూనమ్ కౌర్ కూడా సెక్స్ రాకెట్ గురించి స్పందించింది. అసలు కిషన్ – చంద్ర దంపతులు భార్యభర్తలే కాదని పూనమ్ బాంబు పేల్చింది. అమెరికాలో కిషన్ – చంద్ర దంపతులపై నమోదైన కేసు గురించి ప్రస్తావిస్తూ ఈరోజు పూనమ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇందులో తాను ఎదుర్కొన్న అనుభావాలను పూనమ్ వెల్లడించింది.

కిషన్ – చంద్ర దంపతులకు సంబంధించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి వచ్చి తన గది తలుపులు తట్టాడని పేర్కొంది. అతడు మాట్లాడింది నాకు అర్థం కాదు అనుకున్నాడని.. కానీ తనకు తెలుగు అర్థం అవుతుందని పూనమ్ తెలిపింది. ఆ సమయంలోనే అతి చేస్తే చెంప పగులకొట్టానని పేర్కొంది.

అమెరికాలోని ఓ ఈవెంట్ కోసం తాను వెళ్లిన సమయంలో ఒంటరిగా హోటల్ లో ఉన్న నా వద్దకు వాడు వచ్చాడని.. అమాయకమైన అమ్మాయి అనుకొని రెచ్చిపోతే బుద్ది చెప్పానని తెలిపింది. ధనం ద్వారా లేదా భయపెట్టి అమెరికాలో లొంగదీసుకుంటారని సంచలన నిజాలు బయటపెట్టింది.